కీలక పరిణామాల వేళ చంద్రబాబు, పవన్ సమావేశం- లెక్క తేలింది..!!

స్థానిక ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ మధ్య ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వైసీపీ నామినేషన్ల వేళ చోటు చేసుకున్న ఘటన లపై సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం ఆదేశాలు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా.. జెడ్పీటీసీ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో సీఎం చంద్రబాబు తో డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా పరిణామాల పై చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఒక్క సారిగా కొత్త మలుపు తీసుకుంది. ఘర్షణలు.. కాల్పులు.. కేసుల వరకు వెళ్లింది. అటు మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేసారు. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల కు ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు. ఇక.. తాజా పరిణామాల పైన సీఎం చంద్రబాబు, పవన్ చర్చించారు. రెండో రోజు వరుసగా చంద్రబాబు ఇంటికి వచ్చిన పవన్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటుగా జెడ్పీ ఛైర్మన్ సీట్ల పంపకాల పైన చర్చ చేసినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ఎనిమిది జెడ్పీ స్థానాలను జనసేన కోరినట్లు సమాచారం. 28 జెడ్పీ సీట్లలో 8 సీట్లు ఇవ్వాలంటూ ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కేవలం నాలుగు మేయర్ పదవులకే సరిపెట్టుకోవడంతో పాటు పలు చోట్ల కార్పొరేటర్లు, వార్డు సభ్యుల విషయంలో తగిన వాటా దక్కలేదని జనసేన కింది స్థాయి నేతలు అసంతృప్తితో ఉన్నారు.

విజయవాడలో ఏబీవీకి మద్దతుగా రంగంలోకి జగన్ విధేయ ఐఏఎస్ అధికారి..!!
విజయవాడలో ఏబీవీకి మద్దతుగా రంగంలోకి జగన్ విధేయ ఐఏఎస్ అధికారి..!!
chandrababu-and-pawan-kalyan-meet-again-to-discuss-local-body-elections-details-here

జెడ్పీ స్థానాలపై కూటమి కసరత్తు

ఈ కారణంగానే పలు చోట్ల రెబల్స్ బరిలోకి దిగారు. దీంతో.. ఈసారి తమకు తగినన్ని స్థానాలు దక్కేలా పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల్లో రెబెల్స్ లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అదే విధంగా బీజేపీకి సీట్ల కేటాయింపు పైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో చంద్రబాబు చర్చలు చేస్తున్నారు. జనసేనకు దాదాపు 20శాతం మేర, బీజేపీకి 7శాతం మేర సీట్లు కేటాయింపు జరిగింది. అయితే, జెడ్పీ ఎన్నికల్లో మాత్రం ఈ ఫార్ములా వద్దని నిర్ణయించారు. జనసేన, బీజేపీ ఇద్దరికీ సీట్ల పెంపు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులు, పార్టీల బలాబలాలను బట్టి సీట్ల పంపకాల్లో మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే మూడు పార్టీల ఆశావహులు తమకు అవకాశం ఉన్న చోట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో అధికారికంగా సీట్ల ఖరారు పైన అభ్యర్ధుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+