వైనాట్.. వైనాట్.. వైనాట్..!
నాగార్జున కథానాయకుడి నటించి శివ చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. శివ.. శివ.. శివ.. ఎవడీ శివ.. 100 లారీతో జనాలను తీసుకెళ్లి ఏసేయండి అని విలన్ చెబుతాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వైనాట్.. వైనాట్.. వైనాట్ అన్న పదమే వినపడుతోంది. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 అంటోంది. ప్రతిపక్ష తెలుగుదేశం వైనాట్ పులివెందుల అంటోంది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలవగలిగినప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని, వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనితీరు ఉండాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు.
వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీపై పైచేయి సాధించడానికి, ఆ పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టడానికి వైసీపీ ఎంచుకున్న స్లోగన్.. వైనాట్ 175. దీనికి విరుగుడుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వైనాట్ పాట పాడుతున్నారు. వైనాట్ పులివెందుల.. పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు గెలవలేమని చంద్రబాబు పార్టీ శ్రేణులను ప్రశ్నిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని, అలాగే పులివెందులలో కూడా టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని నెల్లూరు పర్యటనలో చంద్రబాబు చెప్పారు.

పులివెందులలో టీడీపీ గెలవడం అసాధ్యమని, అలాగే కుప్పంలో చంద్రబాబు గెలుస్తారుకానీ లక్ష మెజారిటీ రాదని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇరు పార్టీల అధినేతలు ఈ మార్గం ఎంచుకున్నారని, వారు ఆడే మైండ్ గేమ్ లో వైనాట్ అనే పదం ఒక పావులాంటిదంటున్నారు.












Click it and Unblock the Notifications