ఇదే నా రహస్యం: విద్యార్థిని ప్రశ్నకు చంద్రబాబు, నవ్వులు విరిశాయి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ రహస్యాన్ని విద్యార్థులకు వివరించారు. తాను ఏ పని చేసినా దాన్ని ఆస్వాదిస్తానని, అందుకే తనకు అలసట రాదని చెప్పారు. ఇదే తన రహస్యమని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు.

నవ్యాంధ్ర కోసం ఇంతగా కష్టపడుతున్న మీకు అలసట రాదా? మీ చురుకుదనానికి, అలసటలేమికి రహస్యమేంటని విద్యార్థిని ప్రశ్నించగా.. చేసే పనిని ఆస్వాదించడమే రహస్యమని, విద్యార్థులు కూడా చదువును ఆస్వాదిస్తే ఆ రహస్యమేంటో బోధపడుతుందన్నారు. విద్యార్థిని ఆ ప్రశ్న అడిగిన సమయంలో కార్యక్రమంలో నవ్వులు విరబూశాయి.

Chandrababu answers a student questions

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శ్రీకారం

సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందడుగుగా భావించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే అతితక్కువ ధరకే కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐదు గ్రిడ్ లలో ఫైబర్ గ్రిడ్ ఒకటని సీఎం తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభించాలని భావించినట్టు ఆయన వెల్లడించారు. ఏయూలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. దీని ద్వారా రాష్ట్రంలోని కోటీ 30 లక్షల నివాసాలకు ఇంటర్నెట్ సౌకర్యం అందనుందని ఆయన చెప్పారు. రానున్న నాలుగు నెలల్లో 13 వేల కిలోమీటర్ల ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తికానున్నాయని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా అన్ని జిల్లాలతో కనెక్టివిటీ పెరుగుతుందని సీఎం తెలిపారు.

ఫైబర్ కేబుళ్ల కోసం 3.75 లక్షల విద్యుత్ స్థంభాలను వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 1.1 కోట్ల ఇల్లు, 50 వేల పాఠశాలలు, 6 వేల పీహెచ్ సీలు, 10 వేల టెలికాం టవర్లు, 10 వేల ప్రభుత్వ కార్యాలయాలను అనుసంధానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. కేవలం 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సౌకర్యం కల్పించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. అన్ని జిల్లాలకు ఈ సౌకర్యాలను త్వరలోనే విస్తరిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+