పవన్.. వన్ మ్యాన్ రోడ్ షో..!!

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.

మరోవంక- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. తొలుత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడానికి ప్రయత్నించినప్పటికీ.. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు.

Pawan Kalyan

దీనితో రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. కొద్దిసేపటి కిందటే ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించారు. అక్కడ చుక్కెదురైంది. సరిహద్దుల్లో ఏపీ పోలీసులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలకు అడ్డుపడ్డారు.

అప్పటికే చెక్‌పోస్ట్ వద్ద భారీగా మోహరించారు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు. కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసు చర్యలకు అడ్డుగా నిలిచారు. దీనితో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమను అడ్డుకుంటోన్న పవన్ అభిమానులపై లాఠీ ఛార్జీకి దిగారు.

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి కావడం వల్ల పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు అడ్డుగా పెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ములను రోడ్డు పక్కకు లాగి పడేశారు. అడ్డంకులను తొలగించారు. కొద్దిసేపటి తరువాత పవన్ కల్యాణ్ కాన్వాయ్.. సరిహద్దులను దాటుకుని ఏపీలో ప్రవేశించింది.

ఈ సమయంలో పవన్ కల్యాణ్ కారులో నుంచి ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీకి వెళ్లడానికి విసా, పాస్ట్ పోర్ట్ అవసరం అయ్యేలా ఉంది.. అంటూ నవ్వుతూ కామెంట్స్ చేయడం ఈ వీడియోలో రికార్డయింది.

కొద్దిదూరం వెళ్లిన తరువాత అనుమంచి పల్లె వద్ద కూడా పోలీసులు.. పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీనితో ఆయన కారులో నుంచి కిందికి దిగారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వారిపై ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఎందుకు వెళ్లనివ్వరు.. ? అంటూ ప్రశ్నించారు. ఒక్క కారణం చెప్పండి అంటూ నిలదీశారు.

Pawan Kalyan

ఎవరు, ఎంతగా అడ్డుపడినా..తనను మంగళగిరికి వెళ్లకుండా ఆపలేరని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. కారు ముందుకు కదిలే పరిస్థితి కనిపించకపోవడంతో కాలి నడకన మంగళగిరి వైపు బయలుదేరారు. అక్కడా పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో లాభం లేదనుకున్న పవన్ కల్యాణ్ నడి రోడ్డు మీద పడుకున్నారు. తనను మంగళగిరికి వెళ్లనిచ్చంత వరకూ కదిలేది లేదని భీష్మించారు.

నడిరోడ్డుపై అడ్డంగా పడుకున్న పవన్ కల్యాణ్‌ను పోలీసులు బుజ్జగించారు. వాహనాల రాకపోకలు పెద్ద ఎత్తున స్తంభించిపోయాయని, వాటిని క్లియర్ చేయడానికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన స్పందించలేదు. తనను మంగళగిరికి వెళ్లడానికి అనుమతి ఇచ్చేంత వరకూ కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+