అప్పట్లో యాగాలు చేయలేదే: బాబు, చేశానండీ: కెసిఆర్.. గంటన్నర చర్చలు (పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు సోమవారం నాడు దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో వారిద్దరు అంత సేపు చర్చించుకోవడం గమనార్హం.
విజయవాడకు వెళ్లిన కెసిఆర్‌కు మంత్రులు ఆహ్వానం పలికారు. చంద్రబాబు తన నివాసం వద్ద కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన కెసిఆర్ యాగం ఆహ్వాన పత్రికను అందించారు. చంద్రబాబుకు శాలువా కప్పారు. ఇరువురు చిరునవ్వుతో కాసేపు మాట్లాడుకున్నారు.
అనంతరం లంచ్ చేశారు. కెసిఆర్ కోసం చంద్రబాబు 15 రకాల ఆంధ్రా వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మొత్తం ఇరువురు ముఖ్యమంత్రులు గంటన్నరకు పైగా కలిసి ఉన్నారు. ఎన్నో అశాలపై చర్చించుకున్నారు. వారు రాజకీయాల గురించి కూడా చర్చించుకున్నారా అనే చర్చ సాగుతోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు, కెసిఆర్ మధ్య యాగం గురించిన ఆసక్తికర సంభాషణ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు యాగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరిని ఆహ్వానించారని ప్రశ్నించారు.

కెసిఆర్‌కు బాబు పుష్పగుచ్ఛం
బెజవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

మాట్లాడుకుంటున్న కెసిఆర్, బాబు
బెజవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ ఆఫీసులో మాటా మంతి.

చంద్రబాబుకు కెసిఆర్ పుష్పగుచ్ఛం
బెజవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ ఆఫీసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

కెసిఆర్‌కు శాలువాతో సత్కారం
బెజవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును క్యాంప్ ఆఫీసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాలువాతో సత్కరించారు.

బాబుకు శాలువాతో సత్కారం
బెజవాడ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ ఆఫీసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శాలువాతో సత్కరించారు.

భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయిన దృశ్యం.

భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయిన దృశ్యం. పక్కన మంత్రులు.

మంత్రి పుష్పగుచ్ఛం
ఉండవల్లిలో హెలిప్యాడ్ వద్ద దిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతిస్తున్న మంత్రి రావెల కిషోర్ బాబు

భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయిన దృశ్యం. పక్కన ఏపీ, తెలంగాణ మంత్రులు యనమల, ఈటెల, రావెల, ఎంపీ బాల్క సుమన్.

కెసిఆర్, బాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయిన దృశ్యం.

కెసిఆర్, బాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయిన దృశ్యం.
చండీయాగానికి ఎవరెవరిని పిలిచారని చంద్రబాబు అడిగారు. దానికి మంత్రులు సహా తాను ఎవరెవరిని పిలిచింది కెసిఆర్ వివరించారు. యాగం కార్యక్రమాలు ఎలా జరుగుతుందని, యాగం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని, 4,000 మంది పండితులు యాగంలో పాల్గొంటారని కెసిఆర్ చెప్పారు.
అప్పట్లో మీరు యాగాలు చేయలేదు కదా అని చంద్రబాబు... కెసిఆర్‌ను ప్రశ్నించారు. దానికి కెసిఆర్ స్పందిస్తూ... అప్పట్లోను యాగాలు చేశానండీ అని వివరణ ఇచ్చారు. ఇరువురు ముఖ్యమంత్రులు గంటన్నర భేటీ అనంతరం హైదరాబాద్ బయలుదేరారు.
యనమలతో కెసిఆర్ ముచ్చట
ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడితో తెలంగాణ సీఎం కెసిఆర్ హెలిప్యాడ్ వద్ద కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఏపీ మంత్రులు కెసిఆర్‌కు హెలిప్యాడ్ వద్ద వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యనమల, కెసిఆర్ ప్రత్యేకంగా ముచ్చటించుకోవడం గమనార్హం. అనంతరం కెసిఆర్ హైదరాబాద్ బయలుదేరారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications