తిరుమలలో బాబు, బాలకృష్ణ ప్రత్యేక పూజలు(పిక్చర్స్)
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుతోపాటు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా శ్రీవారిని దర్శనం చేసున్నారు. తిరుప్పాడ సేవలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలకు అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏడుకొండలవాని దివ్యారామమైన తిరుమల పవిత్రత కాపాడటంతోపాటు టిటిడి ప్రక్షాళన తథ్యమని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. శేషాచలం అడవుల్లో యదేచ్ఛగా సాగుతోన్న ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టే విషయంలో కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.
శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని స్విమ్స్ సమీపంలో తన స్నేహితుడు వెంకట్రామిరెడ్డి కుటుంబీకులు నిర్మించిన సాయిబాబా ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూన్ 11, 12 తేదీల్లో మరోసారి సొంత జిల్లా అయిన చిత్తూరుకు ముఖ్యమంత్రి హోదాలో రావాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కాగా, బుధవారం తిరుపతిలో జరిగిన టిడిఎల్పి సమావేశంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు, ఎన్నికైన విషయం తెలిసిందే.

తిరుమలలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమలలో చంద్రబాబు
చంద్రబాబు నాయుడుతోపాటు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా శ్రీవారిని దర్శనం చేసున్నారు. తిరుప్పాడ సేవలో పాల్గొన్నారు.

తిరుమలలో చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలకు అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

తిరుమలలో చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏడుకొండలవాని దివ్యారామమైన తిరుమల పవిత్రత కాపాడటంతోపాటు టిటిడి ప్రక్షాళన తథ్యమని అన్నారు.

తిరుమలలో చంద్రబాబు
సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు.

తిరుమలలో చంద్రబాబు
శేషాచలం అడవుల్లో యదేచ్ఛగా సాగుతోన్న ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టే విషయంలో కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

తిరుమలలో చంద్రబాబు
శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని స్విమ్స్ సమీపంలో తన స్నేహితుడు వెంకట్రామిరెడ్డి కుటుంబీకులు నిర్మించిన సాయిబాబా ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమలలో చంద్రబాబు
జూన్ 11, 12 తేదీల్లో మరోసారి సొంత జిల్లా అయిన చిత్తూరుకు ముఖ్యమంత్రి హోదాలో రావాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

తిరుమలలో చంద్రబాబు
బుధవారం తిరుపతిలో జరిగిన టిడిఎల్పి సమావేశంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పార్టీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు, ఎన్నికైన విషయం తెలిసిందే.

టిడిపి నేతలు
చంద్రబాబు నాయుడుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు ఉమామహేశ్వర రావు, తదితర ఎమ్మెల్యేలు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

తిరుమలలో చంద్రబాబు
చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, అధికారులతో చంద్రబాబు నాయుడు.

తిరుమలలో బాలకృష్ణ
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం జరిగిన తిరుప్పాడ సేవలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications