తెలివిగా తప్పించుకున్న చంద్రబాబు..?
టీడీపీ వ్యవస్థపకుడు నందమూరి తారక రామారావు జయంతి మంగళవారం(మే 28) జరిగింది. ఎన్టీఆర్ జయంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఊరువాడల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ..తమ అభిమాన నాయకుడును గుర్తు చేసుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించలేకపోయారు. ఎన్టీఆర్ జయంతి నాడు చంద్రబాబు విదేశి పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగియగానే ఆయన అమెరికా వెళ్లారు.
ఎన్టీఆర్ జయంతి నాడు విదేశాల్లో ఉన్న కారణంగా చంద్రబాబు హాజరు కాలేకపోయారు.అయితే ఎన్టీఆర్ జయంతి అయిన మరునాడే ఆయన రాష్ట్రానికి తిరిగొచ్చారు.ఎన్టీఆర్ జయంతి ఉందని తెలిసినప్పుడు ఆయన ఒకరోజు ముందుగా వస్తే బాగుండేదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే దీనిపై చంద్రబాబు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జయంతి గురించి ప్రత్యేకంగా ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం లేదని.. అలాంటప్పుడు దానికి అనుగుణంగానే తన టూర్ ప్లాన్ చేస్తే బాగుండేది కదా ? అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్టీఆర్ జయంతి రోజున చంద్రబాబు డుమ్మా కొట్టారన్న అప్రపద మూట్టగట్టుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ జయంతి మంగళవారం (మే 28) జరిగిందని..చంద్రబాబు మే 29 అంటే బుధవారం ఇండియాకు తిరిగొచ్చిన విషయాన్ని ఆయన వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. ఒకరోజు ముందొస్తే ఎక్కడ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించాల్సి వస్తుందో అని ఆయన తెలివిగా తప్పించుకున్నారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచి టీడీపీని లాక్కున్నారనే అపవాదు చంద్రబాబుపై ఉంది. తాజాగా మరోసారి ఎన్టీఆర్‌పై తన వివక్షను చంద్రబాబు ఈ విధంగా చూపించినట్టు అయిందని టీడీపీలోని ఓ వర్గం చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications