Chandrababu Marriage Day: చంద్రబాబు పెళ్లి రోజునే ఊహించని పరిణామాలు
విజయవాడ: పెళ్లి రోజు అంటే జీవితంలో ఎవరికైన ప్రత్యేకమే. వివాహమైన నాటి నుంచి తమ మధ్య ఉన్న అనుబంధం, అనురాగాలను నెమరువేసుకుంటూ ఆనందంగం గడుపుకునే రోజు. కానీ, ఊహించని పరిణామాలతో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 42వ పెళ్లి రోజున ఆనందోత్సాహాలకు దూరమయ్యారు.
పెళ్లి రోజును ఎంతో ఆనందంగా కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య జరుపుకోవాలని చంద్రబాబు దంపతులు అనుకున్నప్పటికీ.. తాజాగా పరిణామాలతో అటు సిట్ కార్యాలయం.. ఇటు కోర్టులోనే గడిచిపోయింది. చంద్రబాబును శనివారం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నంద్యాల నుంచి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున వైద్య పరీక్షలు నిర్వహించి.. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. దీంతో వాదనలు కొనసాగుతున్నాయియ.

కాగా, సెప్టెంబర్ 10, 1981లో చంద్రబాబు నాయుడు, దివంగత నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.నాడు ఏపీ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నందమూరి భువనేశ్వరి వివాహం చెన్నైలో జరిగింది. ఈ దంపతులకు 1983 జనవరి 23న లోకేశ్ జన్మించారు.
దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదుర్కోని పరిస్థితిని చంద్రబాబు తాజాగా ఇవాళ ఎదుర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం ఉదయం నుంచి సీఐడీ అదుపులోనే ఉన్నారు. ఏనాడూ కోర్టు మెట్లు కూడా ఎక్కడం తెలియని చంద్రబాబు.. తన పెళ్లి రోజున కోర్టు ప్రాంగణంలో గడపాల్సిన పరిస్థితి రావడం గమనార్హం.

శనివారం ఉదయం నంద్యాలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 11 గంటలపాటు వాహనంలో విజయవాడకు తీసుకువచ్చారు. అనంతరం సీఐడీ కార్యాలయంలోనే శనివారం రాత్రంతా ఉంచి విచారణ జరిపారు. 70 ఏళ్లకు పైబడిన చంద్రబాబు దాదాపు 24 గంటలపాటు నిద్ర లేకుండానే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబును శనివారం ఉదయం అరెస్ట్ చేసిన సీఐడీ.. ఆదివారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టింది. రెండు రోజుల నుంచి సరిగా నిద్రలేకపోవడంతో కొంత నీరసంగా కనిపించినప్పటికీ.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తన వాదనలను స్వయంగా వినిపించడం గమనార్హం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టి అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, ఏది ఏమైనా పెళ్లి రోజున చంద్రబాబు ఇలా గడపాల్సి రావడంతో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు, అభిమానులు కొంత ఆవేదనకు గురయ్యారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications