మాటల తూటాలు...గుచ్చుకుపోయే పంచ్ లు.. చంద్రన్న స్పీచ్ అదుర్స్
అనకాపల్లి జిల్లా చోడవరంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధికార పార్టీపై, ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలికాలంలో చంద్రబాబు డైలాగులు బాగా పేలుతున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కన్నా ఎక్కువగా పంచ్‌లు వేస్తున్నారని, ఆయన్ను మించి మాటల రచయిత అయ్యారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. చోడవరం సభలో చంద్రబాబు చెప్పిన డైలాగులను, వేసిన పంచ్ లను ఒకసారి పరిశీలిస్తే..

Recommended Video

1. విజయసాయిరెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యత.. ఇదేనా సామాజిక న్యాయం
2. రాష్ట్రంలో నవరత్నాలు కాదు.. నవఘోరాలు జరుగుతున్నాయి
3. ఎమ్మెల్యేలు భూములు దోచుకుంటున్నారు.. నేరాలు.. ఘోరాలు.. అవినీతి.. ఇదీ నవరత్నాల పాలన
4. వైసీపీ వచ్చి మూడేళ్లు.. అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి
5. బొబ్బిలిపులిలా దూసుకుపోతాం.. కొండవీటి సింహంలా గర్జిస్తాం
6. రోడ్లు ఎంతో అందంగా ఉన్నాయో.. కిలోమీటరుకు 150 గుంతలున్నాయి.. నడుములు విరిగిపోతాయి
7. గుంతల్లో మట్టిపోయని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారంట!!
8. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో పంట విరామం ప్రకటించారంటే మీ ప్రభుత్వానికి సిగ్గుందా?
9. రూ.50వేలతో ఐటీ ఉద్యోగాలిస్తే.. రూ.5వేలతో వాలంటీరు పోస్టు ఇచ్చారు
10. నాకు శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలూ లేవు
11. ఉదయం 6.00 గంటలకు ఎంత కూల్ గా ఉంటానో.. రాత్రి 10.00 గంటలకు కూడా అంతే కూల్ గా ఉంటాను
12. హత్య చేసిన ఎమ్మెల్సీ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎటు పయనిస్తుందో అర్థం కావడంలేదు












Click it and Unblock the Notifications