బాబు ఎన్ని ప్రత్యేకహోదాలు తెచ్చారో, పవన్ కళ్యాణ్ మాట్లాడరేం: రోజా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నో స్పెషల్ స్టేటస్‌లు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియాలో స్పెషల్ స్టేటస్, లిక్కర్ మాఫియాలో స్పెషల్ స్టేటస్, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో స్పెషల్ స్టేటస్ తెచ్చారన్నారు.
అలాగే, ఓటుకు నోటు కేసులోనూ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ లభించిందని, ఈ ఘనతలు అన్ని చంద్రబాబువే అన్నారు. అయితే, ఏపీకి కావాల్సిన ప్రత్యేక హోదా మాత్రం తీసుకు రాలేకపోయారన్నారు. కేసుల్లో ఇరుక్కుని వాటి నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడుతూ హోదా అంశాన్ని పక్కన బెట్టేశారన్నారు.

ఎన్నికలకు ముందు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా హోదాపై హామీలు ఇచ్చారన్నారు. ఆపై నరేంద్ర మోడీ పీఎంగా, చంద్రబాబుకు ఏపీ ముఖ్యమంత్రిగా హోదాలు వచ్చినా, ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా రాలేదన్నారు.
ఆనాడు బీజేపీ, టీడీపీలకు ఓటేస్తే మేలు కలుగుతుందని ప్రచారం చేసిన హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చట్టంలో సవరణ చేసి హోదాను తీసుకురావాల్సిన కేంద్ర, రాష్ట్ర నేతలు తప్పించుకు తిరుగుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications