పనికిమాలిన, కరవు సీఎం: బాబును ఏకేసిన శ్రీకాంత్ రెడ్డి

ఇది దౌర్భాగ్యపు ప్రభుత్వం అన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా వర్షాలను మాఫీ చేసిన చరిత్ర బాబుదే అని ఎద్దేవా చేశారు. బాబు అంటేనే కరవు ముఖ్యమంత్రి అన్నారు. ముక్కుసూటిగా పని చేయవద్దని అధికారులకు చంద్రబాబు చెప్పారని, ఇవే వ్యాఖ్యలు వేరే దేసాల్లో అంటే జైల్లో పెట్టే వారన్నారు.
చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రియా లేక తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రియా చెప్పాలన్నారు. చంద్రబాబు తన పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు తన పద్ధతులు మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.
ఇంత చేతకాని సర్కారును తాను ఎక్కడా చూడలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పార్థసారథి విజయవాడలో అన్నారు. బాబు ఈజ్ బ్యాక్ అంటే ఆయన తొమ్మిదేళ్ల పాలనాకాలంలో వచ్చిన కరువు మళ్లీ మొదలైనట్లుగా కనిపిస్తోందన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో చెప్పారని, కానీ ఇప్పుడు బాబు వచ్చాడని తెలిసి రుతుపవనాలు పారిపోతున్నాయన్నారు.
కార్యకర్తలు ఏం చేసినా చూసీచూడనట్లు ఉండాలని కలెక్టర్లకు చెప్పడం ఏమిటన్నారు. రెండు నెలల్లో టీడీపీ నేతల దుబారా ఖర్చు కొంత జోడిస్తే క్యాంప్ కార్యాలయం, మంత్రుల ఆఫీసులు ఏర్పాటు చేయవచ్చునన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ తేదీని ప్రకటించాలన్నారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని చేతకానితనం వల్ల రైతులు కష్టాలు పడుతున్నారు. తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు సర్కారు ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన భరోసా ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications