ఇవి ఇవ్వండి: ఏపీకి మోడీ హామీ, వేగంపెంచాలని బాబు

ఎస్పీఎస్ నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. షార్‌లో మోడీతో చంద్రబాబు 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు.

రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న పరిస్థితిని, ఐపీకి కావాల్సిన సాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను, దానికి అదనంగా చేయాల్సిన సాయం గురించి మోడీకి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు నుండి రాజధాని నిర్మాణానికి నిధులు, రైతు, డ్వాక్రా రుణమాఫీ, పునర్ వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న విద్యాసంస్థల ఏర్పాటు, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ తదితర విషయాల ఆవశ్యకతను మోడీకి వివరించారు.

Chandrababu call on Narendra Modi

మోడీతో భేటీ అనంతరం చంద్రబాబు బయట ఉన్న అధికారులతో మాట్లాడుతూ... ప్రధాని అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని, ఏపీకి అవసరమైన ప్రతి సాయం చేస్తామన్నారని, ఆ వేగాన్ని అందుకునే దిశగా మనం పని చేయాలన్నారు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ఎంత సాయమైన చేసేందుకు సిద్ధమని మోడీ చంద్రబాబుకు హామీ ఇచ్చారని తెలుస్తోంది.

రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైన మోడీ, చంద్రబాబుల భేటీ పదింపావుకు ముగిసింది. ఈ సమావేశంలో మోడీ, బాబు ఇద్దరే ఉన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.10వేల కోట్లు, ఇతర చెల్లింపులు రూ.7వేల కోట్లు కలిపి పదిహేడువేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందని బాబు ప్రధానికి చెప్పారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఒక ఏడాది పాటు రెవెన్యూ లోటును కేంద్రమే భరిస్తుందని పెట్టారని, దీనిలో కొంత మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు.

రెవెన్యూ లోటును కనీసం ఐదేళ్ల పాటు భర్తీ చేస్తేనే ఏపీ అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. బిల్లులో పెట్టిన విద్యాసంస్థల ఏర్పాటు గురించి తెలిపారు. ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తదితర సంస్థలు రావాల్సి ఉందన్నారు.

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కల్పించాలని, ఈ హోదాను పదిహేను ఏళ్లు ఇవ్వాలని కోరారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును తిరిగి ఇవ్వడంతో పాటు.. ఐదేళ్లలో పూర్తి చేస్తే బాధ్యతను తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారని తెలుస్తోంది. రైతు రుణమాఫీపై నేరుగా కాకున్నా పరోక్షంగా సాయం చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+