Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ నెల 9న టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు - జగన్‌ది తుగ్లక్‌ పాలన : చెప్పారు..చేయాల్సిందే : చంద్రబాబు..!!

పెట్రోలు..డీజిల్ ధరల తగ్గింపు డిమాండ్ చేస్తూ టీడీపీ నిరసనలకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా.. ఈ నెల 9న టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేయనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని సీఎం జగన్‌ గతంలో చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని.. ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ధరలు ఉన్నాయని చెప్పారు. పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ఆయన ప్రశ్నించారు.

జగన్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి

జగన్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని తెలిపారు. ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పెట్రోలు ధరలు తగ్గిస్తానని చెప్పి మాట మీద నిలబడాలి కదా అంటూ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించగానే చాలా రాష్ట్రాలు కూడా తమ పరిధి మేరకు ధరలు తగ్గించాయని.. కానీ, ఏపీలో ధరలెందుకు తగ్గించరని నిలదీసారు. అధికారం ఉంది కదా అని బాదుడే బాదుడా అంటూ నిలదీసిన ఆయన.. పెట్రో ధరలు పెరిగితే పరిశ్రమలు, వ్యవసాయం కష్టంగా మారతాయన్నారు.

విధ్వంసం - ధరల బాదుడు

విధ్వంసం - ధరల బాదుడు

నిత్యావసర ధరలు పెరుగుతాయి.. రెండున్నరేళ్లల్లో ఓ పక్క విధ్వంసం.. మరో పక్క నిత్యావసరాలపై బాదుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరలు, నిత్యావసరాలు, మద్యం, ఇసుక, విద్యుత్, ఆర్టీసీ ఛార్డీల వంటివన్ని ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు.. అధికారం ఉందని అనుకుంటే కుదరదు.. ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయే పరిస్థితి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ చేస్తానని జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు..రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 16 - 17 రూపాయాలు తగ్గించాలని డిమాండ్ చేసారు.

9వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు

9వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు

పొరుగు న ఉన్న తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల్లోనూ తగ్గించారని చెప్పుకొచ్చారు. దేశం మొత్తం ఒక దారిలో పోతుంటే జగన్ రెడ్డి మరో దారిలో వెళ్తున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రెండున్నారేళ్లలో విధ్వంసాలు చేస్తూ.. .మరో వైపు అన్నింటి పైనా బాదుడే బాదుడు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినీతి డబ్బు పైన వ్యామోహం తో నకిలీ మద్యం తీసుకొచ్చి భారీ ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన గంట సేపు రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకుల వద్ద పార్టీ నిరసనలు చేపడుతుందని వెల్లడించారు.

జగన్ ప్రభుత్వం పై ఒత్తిడి

జగన్ ప్రభుత్వం పై ఒత్తిడి

ప్రజల్లో అవగాహన పెంచుతామని చెప్పారు. ఇదే సమయంలో బీజేపీ సైతం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ పైన నిరనసలు చేస్తోంది. మరో వైపు జనసేన సైతం దీని పైన ప్రభుత్వాన్ని నిలదీసింది. కానీ, ప్రభుత్వం నుంచి దీని పైన ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులతో వైసీపీ ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు ముందుకు వస్తుందా రాదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+