రేవంత్ రెడ్డి భార్యకు ఫోన్: చంద్రబాబు ప్రతిస్పందనపై ఉత్కంఠ

హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టుపై తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా ప్రతిస్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం సాయంత్రం ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు పెదవి విప్పలేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నారనేది కూడా బయటకు రావడం లేదు.

ఆదివారం రాత్రి మాత్రం ఆయన రేవంత్ రెడ్డి సతీమణి గీతకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. భయపడాల్సిన అవసరం కూడా లేదని ఆయన ఆమెతో అన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు గుప్పుమన్న సమయంలో పరిస్థితి ఒక విధంగా, టీవీ చానెళ్లలో రేవంత్ రెడ్డి స్టీఫన్ సన్‌తో డీల్ వ్యవహారం నడిపిన తీరుపై వీడిుయోలు ప్రసారమైన తర్వాత పరిస్థితి మరో విధంగా ఉంది.

రేవంత్ రెడ్డి పక్కాగా ఇరికిపోయినట్లు అర్థమైన తర్వాత చంద్రబాబు ప్రతిస్పందన ఎలా ఉందనేది ఉత్కంఠను రేపుతున్న విషయం. సంతలో పశువుల్లా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై చంద్రబాబు పదే పదే విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం సాక్ష్యాలతో సహా బయటపడడం ఆయనకు కాస్తా ఇబ్బందిగానే ఉండి ఉంటుంది.

Chandrababu calls revanth Reddy's wife

చంద్రబాబును ఏ మాత్రం విమర్శించినా తెలుగుదేశం పార్టీ నాయకులు విరుచుకపడడం అలవాటు చేసుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అంత బలంగా తమ వాదనను వినిపిస్తున్నట్లు కనిపించడం లేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు గాంచిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీలోనూ అసంతృప్తి ఉంది.

రేవంత్ రెడ్డి పక్కాగా దొరికిపోవడమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం. రేవంత్ రెడ్డిని ఎలా సమర్థించుకోవడం, కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎలా తప్పు పట్టడం అనే విషయాలు వారికి తెలియడం లేదు. మొత్తం మీద, ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తోందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+