'పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు రాజకీయ సలహాదారుగా పెట్టుకోవచ్చు'
చంద్రబాబు అలా అనుకుంటే పవన్‌ను రాజకీయ సలహాదారుగా పెట్టుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమస్యలపై స్పందిస్తుంటే.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి మొదలు నిన్నటి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పర్యటన వరకు అందుకు నిదర్శనాలు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు చురకలు అంటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తే చంద్రబాబు ఆ వైపు (ఆ సమస్య వైపు) చూస్తున్నారని, ఆయన స్పందిస్తేనే అటు చూస్తానని చంద్రబాబు అనుకుంటే పవన్‌ను రాజకీయ సలహాదారుగా పెట్టుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సమస్య పైన స్పందిస్తే దానిపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందిస్తుందనే వాదనలు ఉన్నాయి. నవ్యాంధ్ర రాజధాని భూసేకరణ, పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్కులతో పాటు నిన్న ఉద్ధానం వరకు పవన్ ప్రశ్నించిన సమస్యల పైన టిడిపి ప్రభుత్వం వెంటనే స్పందించింది.
పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే స్పందించడంపై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో వైసిపి అధినేత జగన్ చేసే ఆందోళనలు, నిలదీసే సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందంటున్నారు.
చంద్రబాబు సొంతూర్లో ఏటీఎం..!: నారావారిపల్లెలో నారా రోహిత్ సందడి
అయితే, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే స్పందించడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా 2014లో తమ గెలుపుకు ప్రధాన కారణమైన పవన్‌ను దూరం చేసుకునే ఉద్దేశ్యం చంద్రబాబుకు లేదని, అందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు.
మంత్రుల నుంచి నాయకుల వరకు పవన్.. ఏ విషయం మీద ప్రశ్నించినా స్వాగతించడం గమనార్హం. పవన్ ప్రశ్నించిన ప్రతి అంశంపై ఆయనను దూరం చేసుకోవద్దని టిడిపి స్వాగతిస్తుందా, లేక జగన్ కంటే అర్థవంతమైన సమస్యలు ఆయన లేవనెత్తుతున్నారా, పవన్ - చంద్రబాబు మధ్య ఏదైనా ఉందా అనే చర్చ కూడా ఉంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565











Click it and Unblock the Notifications