హైదరాబాద్‌లో ఇల్లు మారిన చంద్రబాబు: పోలీసుల మల్లగుల్లాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్దె ఇంటికి మారిన నేపథ్యంలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. చంద్రబాబు ఇంటి నుండి ఏ దారిలో బయటకు వెళ్తారు, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై పోలీసులు చర్చిస్తున్నారు.
నారా చంద్రబాబు నాయుడి కుటుంబం హైదరాబాదులోని అద్దె ఇంట్లోకి మారిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లోని ఓ అద్దె ఇంటికి ఆయన కుటుంబం మారింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 65లో ఉన్న ఇంటి స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నారు.
ఆ కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 24లో గల మూడంతస్తుల అద్దె ఇంట్లో ఉంటారు. ఆ ఇంటికిచిన్నపాటి మార్పులు, చేర్పులు చేసుకున్నారు. చైనా పర్యటన తర్వాత తిరిగి వచ్చిన చంద్రబాబు ఇళ్లు మారారు.

కాగా, నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే తాత అయ్యారు. కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి దంపతులు పడ్డంటి కుమారుడికి జన్మనిచ్చారు. దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదుగురు అయ్యారు.
ఇప్పుడు చంద్రబాబు ఇల్లు మారిన నేపథ్యంలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో రోడ్డు నెంబర్ 65 నుండి జూబ్లిహిల్స్ చెక్ పోస్టు మీదుగా ఆయన ప్రయాణం సాగేది. కొత్త ఇంటికి ఓ వైపు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, మరోవైపు రోడ్డు నెంబర్ 36 ఉన్నాయి.
ఈ రెండు మార్గాల్లో ఆయన ఎలా వెళ్తారన్న విషయమై.. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అధికారులు, భద్రతాధికారులతో పోలీసులు చర్చిస్తున్నారు. వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పాటు, రద్దీ సంకేతాలు లేకుండా రోడ్డు నెంబర్ 10 అనువుగా ఉంటుందని వీరు ప్రాథమికంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications