ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ఎంతవరకంటే ? క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు..!

ఏపీలో కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వచ్చే నెల 15 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం అదనపు బస్సుల కొనుగోలుతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడివరకన్న దానిపై సీఎం చంద్రబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఆడబిడ్డలకు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15 నుంచి జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా బస్సులు ఉచితంగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం జిల్లా పరిధిలో అనేది చంద్రబాబు స్పష్టంచేసినట్లయింది.

Chandrababu clarified free bus travel scheme to women within district only

ఇప్పటికే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనశాఖ మంత్రి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై ఇదే క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో వైసీపీ మండలిలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందా లేదా అని ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా జిల్లా పరిధిలో ఈ పథకం అమలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా అదే విషయం చెప్పేశారు. దీంతో మహిళలకు ఉచిత బస్సు పథకంలో భాగంగా 26 జిల్లాల్లోనూ ఆయా జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణాలు చేసేందుకు వీలు ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+