ఆ పత్రిక వక్రీకరించింది: సమైక్య రాష్ట్రంలో చేసిన హామీలంటూ చేసిన వ్యాఖ్యపై బాబు

ఒంగోలు: ఎన్నికల హామీలపై తన వ్యాఖ్యలను ఓ ప్రతిక దుర్మార్గంగా వక్రీకరించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని శీలంవారిపేటలో జన్మభూమి- మాఊరు కార్యక్రమ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కష్టాలు ఉన్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు తాను చెబితే హామీల అమలు కష్టసాధ్యమన్నట్లుగా రాశారని ఆయన అన్నారు. పేదవారు ప్రమాదంలో చనిపోతే రూ.9లక్షల భీమా ఇప్పించనున్నట్లు స్పష్టం చేశారు.

Chandrababu clarifies on his statement on promises

పథకాల అమలులో దళారీ వ్యవస్థ పోవాలని ఆయన అన్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య దళారీ వ్యవస్థ అంతమయ్యేందుకు టెక్నాలజీని పెద్ద ఎత్తున్న వినియోగిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తాను సమైక్య రాష్ట్రంలో హామీలు ఇచ్చానని, రాష్ట్ర విభజన తర్వాత ఆ హామీలను అమలు చేయడం కష్టసాధ్యమని చంద్రబాబు అన్నట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+