చంద్రబాబు బాధ్యతలు, గంటా పుష్పగుచ్ఛం (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఎపి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో పూజలు నిర్వహించిన అనంతరం బాబు బాధ్యతలు స్వీకరించారు. విశాఖ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. సీఎం చంద్రబాబునాయుడుకు పలువురు టీడీపీ మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ సర్జన్ల నియామకాలపై శ్రీనివాస్ తొలి సంతకం చేశారు.

మంత్రి శ్రీనివాస్ పలువురు అధికారులు అభినందించారు. ప్రభుత్వ సెక్టార్లో తగ్గిన 350 మెడికల్ సీట్లపై కేంద్రంతో చర్చిస్తున్నామని, త్వరలో తగ్గిన సీట్ల భర్తీతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో మరో 450 అదనపు మెడికల్ సీట్లు రానున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం లేక్ వ్యూ అతిథి గృహంలో బాధ్యతలు స్వీకరించారు.

చంద్రబాబు సంతకాలు

చంద్రబాబు సంతకాలు

విశాఖపట్నంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఫైలుపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు.

గంటా అభినందన

గంటా అభినందన

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడిని మంత్రి గంటా శ్రీనివాస రావు పుష్పగుచ్ఛంతో అభినందించారు.

మంత్రులతో ఇలా..

మంత్రులతో ఇలా..

చంద్రబాబు పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణ, అధికారులు హాజరయ్యారు.

కామినేని బాధ్యతల స్వీకరణ

కామినేని బాధ్యతల స్వీకరణ

మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే ముందు కామినేని శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. వేదమంత్రాల మధ్య ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.

కామినేని పదవీబాధ్యతలు

కామినేని పదవీబాధ్యతలు

మంత్రిగా కామినేని శ్రీనివాస్ గురువారం ఉదయం పదవీ బాధ్యతలు స్పీకరించారు. ఆయనను పలువురు అభినందించారు.

కింజారపు అచ్చెన్నాయుడు

కింజారపు అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు గురువారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఎన్టీఆర్‌కు నివాళి

ఎన్టీఆర్‌కు నివాళి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు.

కొల్లు రవీంద్ర పదవీ బాధ్యతలు

కొల్లు రవీంద్ర పదవీ బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కొల్లు రవీంద్ర గురువారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ సందర్భంగా అభినందనలు అందుకున్నారు.

స్వీటు తినిపించారు...

స్వీటు తినిపించారు...

మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొల్లు రవీంద్రకు ఇలా స్వీటు తినిపించారు. ఆయనను పలువురు అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+