Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుట్టమన్నుకు బాబు పూజలు, నిమ్మకూరులో లోకేష్: 'అమరావతి'పై సింగపూర్ ఆరా

చిత్తూరు: జిల్లాలోని నారావారిపల్లెలో నిర్వహించిన మన మట్టి - మన నీరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం స్వగ్రామంలో పుట్ట మట్టి సేకరించి ప్రత్యేక పూజలు చేశారు.

Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru

అమరావతి విజయవంతం కావాలని నారావారిపల్లెలో ఆయన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అందరి సంకల్పంతో రాజధాని నిర్మాణం కావాలన్నారు. పదహారువేల గ్రామాల్లో మన నీరు - మన మట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru

ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని అమరావతి రాజధానిగా నిర్ణయించామన్నారు. అమరావతి దేవేంద్రుడి రాజధాని అని చెప్పారు. తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు చాటి చెప్పేలా అమరావతి నిర్మాణం చేపడతామన్నారు. అమరావతికి స్థాన, వాస్తు బలం ఉందన్నారు.

రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా రాజధాని ఉంటుందన్నారు. పవిత్ర భావనతో, అందరి మనోభావాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు అన్నారు. అదే సంకల్పంతో రాజధాని కట్టుకోవాలన్నారు.

Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru

జీవితంలో ఒకేసారి వచ్చే పండుగ అమరావతి నిర్మాణం అన్నారు. అమరావతికి చరిత్ర ఉందని, ఇది బుద్ధుడు నడయాడిన నేల అన్నారు. దేవేంద్రుడి రాజధాని అన్నారు. తెలుగువారి కీర్తి, ప్రతిష్టలు పెంచేలా అమరావతి రాజధాని నిర్మిస్తామన్నారు. రాజధాని నిర్మాణం 5 కోట్ల ప్రజలకు సంబంధించినదన్నారు.

రాజధాని నిర్మాణంలో జపాన్, సింగపూర్ దేశాల సహాయం తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తామని చెప్పారు.

Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru

కాగా, చంద్రబాబు నారావారిపల్లి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రుల సమాధులను దర్శించుకున్నారు. అనంతరం మట్టిని సేకరించారు. చంద్రబాబు సర్వమత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు, నిమ్మకూరులో మన మట్టి - మన నీరు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని కుమ్మరితోవ తపోవనంలో పుట్టమట్టి, పాండవ నది నుంచి పుణ్య జలాలను ఆర్థిక శాఖ యనమల రామకృష్ణుడు సేకరించారు. అన్నవరంలోని పంపానది నుంచి పుణ్య జలాలను టిడిపి జిల్లా అధ్యక్షులు సేకరించారు.

Chandrababu collects soil from Naravaripalle, Lokesh from Nimmakuru

'అమరావతి'పై సింగపూర్ ఆరా

రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై సింగపూర్ ప్రతినిధులు ఆరా తీశారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ రాయ్ కో ఉద్దండరాయునిపాలెంలో సభా ప్రాంగణంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.

హెలీప్యాడ్ స్థలాన్ని అక్కడి నుంచి వేదికకు వచ్చే రోడ్డు మార్గాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ నెల 18 నుంచి భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ఎస్పీజీ దళాల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతను చేపట్టనున్నామన్నారు. రాయ్ కోకు.. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సీఆర్డీయే అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+