బాహుబలికే మూడేళ్లు పట్టింది, అమరావతి అంతకంటే అద్భుతం: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అద్భుతమైన బాహుబలి సినిమాను నిర్మించేందుకు మూడేళ్ల సమయం తీసుకుందని, అంతకంటే మహాద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇంకా సమయం తీసుకుంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించమని భగవంతుడు తనను ఆదేశించాడని చెప్పారు. రాజధాని బాధ్యతను ఆయన తనకు అప్పగించాడని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఉంటుందని చెప్పారు.

జగన్ మగాడిలా, బాబును చూసి 200 మంది పారిపోయారు, కాళ్లు పట్టేందుకు: రోజా

Chandrababu compares Amaravati with Bahubali

బాహుబలి సినిమా తీయాలంటేనే మూడేళ్లు పట్టిందని, మరి రాజధాని నిర్మాణానికి మరింత సమయం తీసుకోదా అని అభిప్రాయపడ్డారు. విమర్శలు సరికాదని, చేతనైతే అభివృద్ధికి సహకరించాలన్నారు. రాజధానికి విపక్షాలు అడ్డుపడటం వల్ల ఏడాదిని కోల్పోయామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Monday compared Amaravati with Bahubali.
Please Wait while comments are loading...