Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెంకయ్యను తిడతావా: పవన్ పేరెత్తకుండా బాబు ఆగ్రహం

నిమ్మకూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍‌కు కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రి వెంకయ్యను విమర్శించడంపై ఆయన భగ్గుమన్నారు.

పవన్ పేరు పెట్టకుండా విమర్శించారు. కొంతమంది కావాలని వెంకయ్యను విమర్శిస్తున్నారని, ఆయనను విమర్శిస్తే వచ్చేదేమీ లేదన్నారు. ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలో ముఖ్యమన్నారు.

Chandrababu Naidu

విభజన సమయంలో ఆస్తులను ఒకలా, అప్పులను మాత్రం జనాభా ప్రాతిపదికన ఇచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే, ప్రత్యేక హోదా ఇవ్వనప్పటికీ ఆ మేరకు సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు.

కృష్ణా జిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో బెల్‌ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉందన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.

కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతం రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిందన్నారు. కృష్ణా డెల్టాను కాపాడేందుకు పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు మళ్లించినట్లు చెప్పారు. 50 ఎకరాల్లో రూ.300కోట్ల వ్యయంతో నిర్మించబోయే బెల్‌ సంస్థ ద్వారా వెయ్యి ఉద్యోగాలు వస్తాయని, అవన్నీ స్థానిక యువతకే దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు.

2018 నాటికి బెల్‌ పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే తన లక్ష్యమని, ఏ విషయంలోనూ రాజీ పడబోనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రం కలిసి పని చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అనేక సంస్థలు వస్తున్నాయన్నారు.

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వెంకయ్య నాయుడు, అరుణ్‌ జైట్లీ పోరాడారన్నారు. అయితే ఆ హామీని చట్టంలో పొందుపరచకపోవడం వల్లే ఇప్పుడు సమస్య వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరనందువల్ల. దానికి సమానమైన ప్రయోజనాలతో ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్యాకేజీని అంగీకరించామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+