వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలియదు, ఏదేదో: జగన్‌పై బాబు, మీరు కాదని కేసీఆర్‌కి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రుణమాఫీ చేయలేరన్న ప్రతిపక్ష నేత (వైయస్ జగన్) వ్యాఖ్యల పైన ఏం చెబుతారని విలేకరులు ప్రశ్నించారు.

Chandrababu counters YS Jagan

దీనిపై చంద్రబాబు స్పందించారు. సదరు ప్రతిపక్ష నేత కొత్తగా వచ్చారని, కొత్తగా వచ్చిన వారికి ఏమీ తెలియదని, ఏదీ తెలియకుండానే ఏదేదో మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఆయనకు అనుభవం లేదని, నేర్చుకోవాలనే ఆలోచన కూడా లేదని విమర్శించారు. ప్రజలు ఓడించినా కూడా ఇంకా మారటం లేదన్నారు. ఆ ప్రతిపక్ష నేత తండ్రియే గతంలో రుణమాఫీ దండుగ అన్నారన్నారు.

మరోవైపు, ఎంసెంట్ కౌన్సెలింగ్ పైన కూడా స్పందించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పైన తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. స్థానికతను నిర్ణయించేది తెలంగాణ ప్రభుత్వం కాదని, దానికి చట్టాలున్నాయన్నారు. ఆర్డికల్ 371 డీ ప్రకారం స్థానికత నిర్ణయిస్తారన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu counters to YS Jagan on farm loan waiver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X