ఢిల్లీ పర్మినెంట్ కాదు: వెంకయ్య: గల్లా జయదేవ్‌కు తప్పిన ప్రమాదం

నెల్లూరు: బిజెపి నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో జెన్‌కో థర్మల్ పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. తనకు ఢిల్లీ పర్మినెంట్ కాదని, గల్లీనే శాశ్వతమన్నారు. తాను నెల్లూరు జిల్లాను మరిచిపోనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాను అందించగలుగుతోందన్నారు.

గతంలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం ఏపీకి కేంద్రం సహకరిస్తోందన్నారు. రాష్ట్రానికి సీఎంగా సమర్థ నాయకుడిని ఎన్నకోవడం ప్రజల అదృష్టమని, ఏపీని విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారన్నారు.

ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని దేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారన్నారు. ముద్ర బ్యాంకు ద్వారా చిరువ్యాపారులకు ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

అందరికీ బ్యాంకు ఖాతాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. నిరుపేదలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ది సాధ్యమని ప్రధాని మోడీ చెప్పారన్నారు. 24గంటలు కరెంటు ఇచ్చే వ్యవస్థను ప్రధాని మోడీ ప్రవేశపెట్టారన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ భారత దేశానికంతా విద్యుత్‌ సరఫరా చేయగలుగుతామన్నారు.

Chandrababu dedicates Nellore Zenco to the Nation

రెండు అతిపెద్ద విద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, విద్యుత్‌ కేంద్రాల వల్ల ఇక్కడి రూపు రేఖలు మారబోతున్నాయన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. అభివృద్ధి జరగాలంటే విద్యుత్‌ చాలా అవసరమని, విభజన తర్వాత కేంద్రం సహకారంతో 22.5 మిలియన్‌ యూనిట్ల కొరతను అధిగమించామన్నారు.

సాంకేతికత అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేదే తమ లక్ష్యమన్నారు. ఉద్యోగాలకోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం రాకూడదని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి పైసా పేదలకు అందాలని, పేదల జీవితాల్లో వెలుగు ప్రసాదించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని నేలటూరులో జెన్ కో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

గల్లా జయదేవ్ కాన్వాయ్‌లో ప్రమాదం

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కాన్వాయ్‌కు శనివారం ప్రమాదం తప్పింది. పేరేచర్ల పైవంతెన వద్ద అయిదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. రూ.6కోట్ల వ్యయంతో మేడికొండూరులో చేపట్టిన 2 వంతెన పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో 5 వాహనాలుస్వల్పంగా ధ్వంసమయ్యాయ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+