ఏపీ అప్పుల్లో, 42వేల కోట్లు చంద్రబాబు ఇచ్చినవే : బుగ్గన
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ సంధర్భంగా ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి కొత్త ప్రభుత్వానికి వేల కోట్ల రుపాయల అప్పులు మిగిల్చిపోయారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని ఎద్దెవా చేశారు.

టీడీపీ ప్రభుత్వం 42వేల కోట్లు అప్పులు చేసి వెళ్లారు
ఏపీలో నెలకోన్న ఆర్ధిక పరిస్థితిపై విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే అధికార పార్టీ స్పందించింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజెందర్ రెడ్డి టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. వేల కోట్ల రుపాయాల అప్పులు చేసిన గత ప్రభుత్వం మాగురించి మాట్లాడుతుందా అంటూ మండిపడ్డారు. వేల కోట్ల అప్పులు మూడు నెలల్లో తీర్చుతామా అని ప్రశ్నించారు. సాధారణంగా కొత్త ప్రభుత్వానికి అయిదు నుండి పదివేల కోట్లు మాత్రమే ఇస్తుందని కాని గత ప్రభుత్వం మాత్రం 42వేల కోట్ల రుపాయాలను అప్పులను అప్పగించిందని ఆయన చెప్పారు.

కాంట్రాక్టర్లకే డబ్బులు చెల్లించారు
ఇక తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే వేల కోట్ల రూపాయలు చెల్లించిందిని కాని ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం చెల్లించలేదని దుయ్యబట్టారు. గతంలో తెచ్చిన అప్పులను ఇతర రంగాలకు బదీలీ చేసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆయన విమర్శలు చేశారు. విద్యుత్ రేట్లు తగ్గుతున్నాయని తెలిసినా, ఎక్కువ ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి, డిస్కంలకు ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలోనే ఎనిమిది మంది కాంట్రాక్టర్లకు వెయ్యికోట్ల రుపాయలను చెల్లించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజే అయిదువేల కోట్లను అప్పు చేశారని చెప్పారు.

చంద్రబాబుపై పారాచూట్ కథ
చంద్రబాబుపై మంత్రి సెటైర్లు వేశారు. ఆయన సరైన సమాచారం లేకుండా ఎవరో స్లిప్‌లు ఇస్తే మాట్లాడాతారని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయనకు ఎవరో చెబుతున్న సమాచారం తప్ప స్వంతగా ఆలోచించే శక్తి లేదని విమర్శించారు. ఇందుకోసం ఆయన ఓ కథను కూడ చెప్పారు. ఇందులో ఆయన విమానంలో నుండి పారాచూట్‌కు బదులుగా స్కూల్ పిల్లవాడి బ్యాగ్‌వేసుకుని దూకే మనస్తతత్వంలో ఉన్నారని ఎద్దెవా చేశారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవరంగం అభివృద్ది తగ్గి, వ్యవసాయ రంగంపై అధారపడేవారి శాతం పెరిగిందని చెప్పారు.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications