పదేళ్ల తర్వాత ఛేంబర్‌లోకి ప్రవేశించిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబునాయుడు పదేళ్ల తరువాత సచివాలయంలోని సీఎం కార్యాలయంలోకి ప్రవేశించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఎల్‌బ్లాక్‌లోని సీఎం కార్యాలయంలోకి చంద్రబాబు అడుగుపెట్టారు. వేదపండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా, సీఎస్ ఐవైఆర్‌కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకుడు మురళీకృష్ణ తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. ఇక నుంచి సచివాలయం నుంచి బాధ్యతలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.
లేక్‌వ్యూ క్యాంప్ ఆఫీస్‌గా ఉంటుందని, అప్పుడప్పుడు లేక్‌వ్యూ నుంచి కూడా విధులు నిర్వహించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని పాలన కొనసాగిస్తూ వస్తున్నారు.
సచివాలయంలోని ఎల్‌బ్లాక్‌ను ఏపీకి కేటాయించడంతో ఏడో అంతస్థులో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రూ.10 కోట్లతో పూర్తి హైటెక్ హంగులతో బుల్లెట్ ప్రూఫ్ విధానంలొ ఈ ఛాంబర్‌ను తీర్చిదిద్దారు. చాంబర్‌లోకి అడుగిడిన సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

ఛేంబర్‌లోకి చంద్రబాబు
పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఛేంబర్‌లోకి శుక్రవారం దసరారోజు అడుగు పెట్టారు.

ఛేంబర్‌లో చంద్రబాబు
సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛేంబర్‌లోకి ప్రవేశించిన చంద్రబాబు నాయుడికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, ఇతర అధికారులు స్వాగతం చెప్పారు.

ఛేంబర్‌లోకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని తన ఛేంబర్ నుంచి కార్యకలాపాలు సాగించడం ప్రారంభించారు.

ఛేంబర్‌లోకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిఎం ఛేంబర్‌లోకి ప్రవేశించినప్పుడు అభినందనలు తెలుపుతూ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు

ఛేంబర్‌లోకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఛేంబర్‌లోకి ప్రవేశించినప్పుడు వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఛేంబర్‌లోకి చంద్రబాబు
ఇక నుంచి తాను సచివాలయంలోని ఛేంబర్ నుంచే విధులు నిర్వహిస్తానని, అప్పుడప్పుడు లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి కూడా విధులు నిర్వహిస్తానని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications