లీక్‌పై చంద్రబాబు చీవాట్లు: అవంతి శ్రీనివాస్ కొంప ముంచారా?

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాసిన లేఖను బయటపెట్టిన అనకాపల్లి పార్లమెంటు సభ్యుడదు అవంతి శ్రీనివాస్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్గి మీద గుగ్గిలమైనట్లు తెలుస్తోంది. జయంత్ సిన్హా రాసిన ఉత్తరాన్ని లీక్ చేయడం వల్ల టిడిపి, ప్రభుత్వానికి నష్టం జరిగిందే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని చంద్రబాబు అన్నట్లు సమాచారం.

పైగా, జయంత్ సిన్హా లేఖ బయటపడడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి బుధవారం ఉదయం తమ నివాసంలో జరిపిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే జయంత్ సిన్హా రాసిన లేఖను పత్రికలకు విడుదల చేయవద్దని సూచించినట్లు తెలిసింది. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవటంలో జాప్యం చేయటంపై చర్చ జరిగినప్పుడు పలువురు ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్‌డిఏ ప్రభుత్వం వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టాలని వారంతా డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుజనా చౌదరి వారికి నచ్చచెబుతూ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడినట్లు తెలిసింది.

Chandrababu expresses anguish at Avanthi Srinivas

అయితే జయంత్ సిన్హా రాసిన ఉత్తరం బుధవారం మధ్యాహ్నానికే పత్రికలకు చేరిపోయింది. సిన్హా లేఖను మీడియాకు లీక్ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని సమాచారం.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఇప్పుడే గొడవకు దిగ్గవద్దని చంద్రబాబు ఎంపీలకు సూచించినట్లు చెబుతున్నారు. బాబు ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్‌లోనూ బిజెపికి దూరమవుతున్నామనే అభిప్రాయం కలిగించకూడదని చెప్పినట్లు తెలుస్తోంది.. రాష్ట్భ్రావృద్ధి కోసం ఎన్‌డిఏ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసి అవసరం ఉన్నందున తొందర పడి, విమర్శలు చేయొద్దని అధినేత సలహా ఇచ్చారంటున్నారు.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బుధవారం లోక్‌సభలోబడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించడం బిజెపిలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా మేరకే జయదేవ్ ఎన్‌డిఏపై విరుచుకుపడి ఉంటారని బిజెపి జాతీయ నాయకులు భావిస్తున్నారు.

చంద్రబాబు 2018 వరకు కేంద్రం నుంచి తీసుకోవలసిన అర్థిక సహాయాన్నంతా తీసుకుంటారని వారు భావిస్తున్నారు. బిజెపితో ఇప్పుడిప్పుడే సంబంధాలు తెంచుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందదనేది ముఖ్యమంత్రికి బాగా తెలుసునని వారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+