‘గౌరీ శంకర్! నన్ను గుర్తుపెట్టుకో..తప్పకుండా సార్’: విద్యార్థులతో బాబు ముఖాముఖి
చదువుకోవాలనే తపన ఉన్న నిరుపేద యువతీయువకులకు తాను అన్నలా అండగా నిలుస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ మందిరంలో మంగళవారం జ్యోతిరావు పూలే .
విశాఖపట్నం: చదువుకోవాలనే తపన ఉన్న నిరుపేద యువతీయువకులకు తాను అన్నలా అండగా నిలుస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ మందిరంలో మంగళవారం జ్యోతిరావు పూలే 191వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ
ఈ సందర్భంగా చంద్రబాబు.. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ, ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పథకంలో లబ్ధిపొందిన విద్యార్థి తండ్రితోపాటు, గ్రూప్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న యువతతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.

ముఖాముఖి
గంగాడ తౌడు అనే వ్యక్తితో మాట్లాడుతూ.. ‘మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు' అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దానికి ఆయన మాట్లాడుతూ.. బీటెక్ పూర్తిచేసి కెనడాలో పీజీ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం రూ.10 లక్షలకు గాను ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చిందని, మిగిలిన డబ్బులు త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెప్పినట్టు పేర్కొన్నారు.

ఆర్థిక సాయం
అనకాపల్లి సమీపంలోని రాజుపాలేనికి చెందిన రమాదేవి మాట్లాడుతూ.. బీటెక్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకున్నానని, ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపింది. కోచింగ్ కోసం తనకు ‘ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ' పథకం కింద ఆర్థిక సాయం అందించినట్టు పేర్కొంది.

ఊహించలేదు..
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని ఓ పల్లెటూరుకు చెందిన గౌరీ శంకర్ మాట్లాడుతూ.. బీటెక్ తరువాత కోచింగ్ కోసం లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్‌లో చేరుతానని ఊహించలేదన్నారు.

పాదాభివందనం
తనకంత స్తోమత లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పథకం కింద అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి ‘ఉద్యోగం వచ్చిన తరువాత నన్ను గుర్తుపెట్టుకో గౌరీశంకర్' అన్నారు. దీంతో ‘తప్పకుండా సార్.. మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకుంటా' అని గౌరీశంకర్ బదులిచ్చాడు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications