నన్నేం చేయలేరు, సిఎం లీకు వీరుడు: బాబు, వారిపైనా
శ్రీకాకుళం/హైదరాబాద్: నీతి, నిజాయితీతో ఉన్న తనను ఎవరు ఏమీ చేయలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల పైన ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెసుకు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు బ్రాంచ్ ఆఫీసులుగా మారాయని ఎద్దేవా చేశారు. తెరాస, జగన్ పార్టీలు ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోక పోవడమే అందుకు నిదర్శనమన్నారు. సోనియా నాయకత్వంలోనే ఆ రెండు పార్టీలు డ్రామాలుడుతున్నాయని విమర్శించారు.

కాంగ్రెసు, తెరాస, జగన్ పార్టీల బంధం నిన్నటి సభతో బట్టబయలైందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డవి ఉత్తర కుమార ప్రగల్భాలు అని ధ్వజమెత్తారు. ఆయన ఓ లీకు వీరుడని ఎద్దేవా చేశారు. తెలుగు జాతిని సర్వనాశనం చేయడం, తెలుగుదేశం పార్టీని అంతం చేయడమే సోనియా లక్ష్యమన్నారు.
నీటి సమస్యలు రావు: వినోద్ కుమార్
విభజన జరిగినా రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు రావని తెరాస నేత వినోద్ కుమార్ హైదరాబాదులో అన్నారు. సీమాంధ్రలో అధికారం కోసం చంద్రబాబు, జగన్, కిరణ్ కుమార్ రెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికారమే లక్ష్యంగా పార్టీ పెట్టిన జగన్‌కు సరైన అవగాహన లేదన్నారు. రాష్ట్రం విడిపోయాక సీమాంధ్రలో 25 పార్లమెంటు స్థానాలే ఉంటే జగన్ 30 స్థానాలలో ఎలా గెలుస్తారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications