కేశినేని నాని చేతికి బాబు ఫాం, లోకేష్ యాత్ర (పిక్చర్స్)
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు స్థానంపై తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం కేశినేని నానికి విజయవాడ లోకసభ పోటీకి సంబంధించి బి ఫాం అందజేశారు.
కేశినేని నాని బుధవారం టిడిపి తరఫున లోకసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. విజయవాడ అభ్యర్థిత్వంపై చంద్రబాబు నాయుడు పైన తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రముఖ రాజకీయ పార్టీల నేతల నుండి ఒత్తిడి వచ్చినట్లుగా ఊహాగానాలు వచ్చాయి.

చంద్రబాబు
విజయవాడ పార్లమెంటు స్థానంపై తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం కేశినేని నానికి విజయవాడ లోకసభ పోటీకి సంబంధించి బి ఫాం అందజేశారు.

చంద్రబాబు
కేశినేని నాని బుధవారం టిడిపి తరఫున లోకసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. విజయవాడ అభ్యర్థిత్వంపై చంద్రబాబు నాయుడు పైన తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రముఖ రాజకీయ పార్టీల నేతల నుండి ఒత్తిడి వచ్చినట్లుగా ఊహాగానాలు వచ్చాయి.

చంద్రబాబు
నాలుగు రోజులుగా తర్జన భర్జన పడుతున్న చంద్రబాబు చివరకు కేశినేని నానికే టిక్కెట్ కేటాయించి.. బి ఫాం ఇచ్చారు. పొట్లూరి కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు
పొట్లూరికి టిక్కెట్ ఇచ్చే వరకు తాను టిడిపి అభ్యర్థులకు ప్రచారం చేయనని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ చంద్రబాబు కేశినేని నానికే టిక్కెట్ ఇచ్చారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీకి సంబంధించిన ఓ ప్రచార సిడిని విడుదల చేస్తున్న దృశ్యం.

నారా లోకేష్
నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కావాలో.. 16 నెలల జైలు అనుభవం ఉన్న యువనేత కావాలో.. ప్రజలే తేల్చుకోవాలని నారా లోకేశ్ ప్రజలను కోరుతున్నారు.

నారా లోకేష్
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత యువనేత తిన్న ప్రతి రూపాయిని కక్కించి, రైతు, మహిళా రుణమాఫీకి వినియోగిస్తామని హామీ ఇస్తున్నారు.

Click it and Unblock the Notifications