కలిసే వెళ్తాం: బిజెపితో పొత్తుపై ఎమ్మెల్యేలకు చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తుంటుందని, కలిసి పోటీ చేస్తామని, మనం కూడా కొన్ని చోట్ల వారిని సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, బిజెపి నేతలతో కలిసి పని చేయడానికి ఇప్పటి నుంచే ప్రాధాన్యమివ్వాలని సూచించారట. స్థానికంగా ఏవైనా కార్యక్రమాలు ఉంటే వారిని కలుపుకొని వెళ్లాలని, ఉభయ పార్టీల శ్రేణుల మధ్య సంబంధాలు పెంచడానికి ప్రయత్నం చేయాలని, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలకు రావాలని బిజెపి జాతీయ నాయకత్వం తనను కోరుతోందన్నారు.
తాను కూడా వారి కోసం కొంత సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారని తెలుస్తోంది. సీమాంధ్రలో చాలామంది నాయకులు టిడిపిలోకి వస్తామంటున్నారని, వారిలో ఎవరి అవసరముందో చూసి నిర్ణయం తీసుకుందామన్నారు. ప్రతి జిల్లా నుంచి చాలామంది పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని, వస్తామన్న వారినందరినీ తీసుకోవడం కాకుండా మనకు ఎక్కడ అవసరం ఉందో ఎవరి అవసరం ఉందో దాన్ని బట్టి తీసుకుందామని సూచనలు చేశారట.
పార్టీకి ఉపయోగపడేవారు వస్తామన్నప్పుడు అందరూ ఆహ్వానించాలని, ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తనతో చెప్పాలని, మాట్లాడుతానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామని సూచించారట. పల్లె పల్లెకూ తెలుగుదేశం కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో అనుకొన్న స్థాయిలో నిర్వహించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications