అతను చెప్పిందే వేదం..! అతని మాటే శాసనం!!

ప్రతి జిల్లా నుంచి చంద్రబాబుకు నమ్మకమైన నేతలుంటారు. వారి మాటకే ప్రాధాన్యత దక్కుతుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విలక్షణమైన రాజకీయవేత్త. తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని నమ్మకస్తులైన మనుషులద్వారా ఒకటికి రెండుసార్లు పూర్తిస్థాయిలో తనిఖీ చేసుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని నడిపిస్తున్న వ్యక్తి కాబట్టి ప్రతి జిల్లాకు ఒకరిద్దరు నమ్మకమైన మనుషులుంటారు.

వారు సీనియర్ నేతలు కావచ్చు.. పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు.. మాజీ మంత్రులు కావచ్చు.. ఇలా ఎవరైనా సరే ఒక జిల్లాకు సంబంధించి నిర్ణయం తీసుకునే క్రమంలో కీలకమైన నేతను కూడా సంప్రదిస్తారు. జిల్లాలో ఏదైనా సంఘటన జరిగినా, నిర్ణయానికి అనుమతివ్వాలన్న సదరు నేత నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే.

ప్రతి జిల్లాకు కీలకమైన నేత

ప్రతి జిల్లాకు కీలకమైన నేత

ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో బాబుకు నమ్మకమైన కీలక నేత ఒకరు ఉంటారు. ఆ జిల్లాలో ఎటువంటి సంఘటన జరిగినా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా తాను నమ్మిన నేత నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. రాకపోతే ఆ విషయాన్ని అలాగే పెండింగ్ లో పెడుతుంటారు. ఏ నేత అయినా అనుసరించే విధానం ఇదే. ఎవరో ఒకర్ని తప్పక నమ్మాల్సిన పరిస్థితి రాజకీయాల్లో ఎదురవుతుంటుంది.

నెల్లూరుకు సంబంధించి నారాయణే?

నెల్లూరుకు సంబంధించి నారాయణే?

అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ ఒకరు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉంటూ తన విద్యాసంస్థలను మాత్రమే చూసుకుంటున్నారు. రాజకీయాలకు దూరమవుతారని కూడా వార్తలు వచ్చాయి.

కానీ వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో తీసుకున్న మలుపులను బట్టి నారాయణ యాక్టివ్ గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. నెల్లూరు సిటీ నుంచి స్వల్ప తేడాతో ఓటమిపాలైన నారాయణ మరోసారి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనే లేదన్నట్లు వార్తలు వస్తున్నాయి. కోటంరెడ్డి చంద్రబాబును కలిసినప్పుడు నారాయణతో టచ్ లో ఉండాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీకి ప్రధాన ఆర్థిక వనరు

పార్టీకి ప్రధాన ఆర్థిక వనరు

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలాంటి సీనియర్ నేత ఉన్నప్పటికీ నారాయణతో టచ్ లో ఉండమన్నారంటే అంతర్గతంగా రాజకీయాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దూరంగా ఉన్నారా? లేదంటే తిరిగి యాక్టివ్ అవుతున్నారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దూరంగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నట్లు అర్థమవుతోంది. కోటంరెడ్డి వ్యవహారాన్ని నారాయణతో చర్చించిన తర్వాతే ఓకే చేసినట్లు తెలుస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన నారాయణ తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఆర్థిక వనరే కాకుండా చంద్రబాబునాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+