జగన్ అమలు చేసిన సెబ్ ను రద్దు చేసిన డీజీపీ, 70 శాతం మంది ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చెయ్యడానికి స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్ ను రద్దు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెబ్ కు కేటాయించిన 4,393 మంది ఎక్సైజ్ శాఖ సిబ్బందిని తిరిగి ఎక్సైజ్ శాఖకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి రాక ముందు ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో ఇప్పుడు అదే తరహాలో ఎక్సైజ్ శాఖ పని చెయ్యడానికి సిద్దం అయ్యింది.

Chandrababu government canceled SEB in Excise Department implemented by Jagan government

జగన్ ప్రభుత్వం అప్పట్లో సెబ్ కు కేటాయించిన 70 శాతం మంది ఉద్యోగులు తిరిగి ఎక్సైజ్ శాఖలోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సెబ్ ను రద్దు చేస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సెబ్ లో ఉన్న 70 శాతం మంది ఉద్యోగులను మాతృ శాఖలకు తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సెబ్ ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో ఉన్న 6,274 మంది ఉద్యోగుల్లో కేవలం 1,881 మంది ఉద్యోగులను మాత్రమే ఎక్సైజ్ శాఖలో ఉంచిన గత వైసీపీ ప్రభుత్వం మిగిలిన 70 శాతం మందిని సెబ్ కు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకు వచ్చిన తరువాత సెబ్ ను ఏర్పాటు చేసి ఎక్సైజ్ శాఖ ని నిర్వీర్యం చేసిందని, వైసీపీ నాయకుల సొంత లాభం కోసమే సెబ్ ను ఏర్పాటు చేశారని అప్పట్లో టీడీపీ నాయకులు మండిపడ్డారు.

ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో ఉన్న 70 శాతం మంది ఉద్యోగులను సెబ్ కు కేటాయించారు.. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గం సెబ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ విధానం తీసుకొస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సెబ్ ను రద్దు చేసి అందులో పని చేస్తున్న 70 శాతం ఉద్యోగులను ఎక్సైజ్ శాఖలో తిరిగి కలిపేసింది. గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సబ్ ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+