ఇంటింటికి రేషన్ బియ్యం, చంద్రబాబు ప్రభుత్వంలో ఆడుతున్న ఆ డీలర్ల కథ?
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గత వైసీపీపి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటి పరిశీలిస్తుంది. ఇంటింటికి ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలు (ఎండీయూ వాహనాలు) విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా కొందరు డీలర్లు వ్యవహరిస్తున్నారని వెలుగు చూసింది. ఇప్పుడు ఈ విషయంలో కూటమి పార్టీల నాయకులు సమాచారం సేకరిస్తున్నారు.
గత నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఎండీయూ వాహనాలు సక్రమంగా తిరిగినట్లు దాఖలాలు లేవు, అయితే వాహనాల డీలర్లు నెలనెల జీతాలు తీసుకుంటున్నారని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో ఎండీయూ వాహనాలు ఇంటింటికి తిరిగి ఉచిత రేషన్ సరుకులను ప్రజల పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు జిల్లాలో ఎండీయూ వాహనాలు సక్రమంగా తిరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

ఎండీయూ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 21 వేలు జీతం ఇస్తుంది. ఈ లెక్కన ఎండీయూ వాహనాలు తిప్పే వారికి ప్రతినెల కోట్లాది రూపాయలు జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇంటింటికి ఉచిత రేషన్ సరుకులు సరఫరా చేయడానికి ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేశారు. గత నెలలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొత్త డీలర్లను ఏర్పాటు చేసింది. అయితే కొత్త డీలర్లకు ఈ -పాస్ వేలిముద్రలు సేకరించడం ఆలస్యం కావడంతో ఇప్పుడు ఎండీయూ వాహనాలు తిప్పుతున్న వారు ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైందని ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు పాత ఎండీయూ వాహనాలు తిప్పుతున్న వారు ఈ పాస్ వేలిముద్రలు వేస్తే కచ్చితంగా మాకు జీతాలు వస్తాయని ధీమాతో ఉన్నారని సమాచారం. అయితే కొత్త డీలర్ల ఈ- పాస్ వేలిముద్రలు సేకరించకపోవడంతో ఇప్పుడు పాత డీలర్లు ఓ ఆట ఆడుకుంటున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆడినట్లు ఆడాలని వీళ్లు ప్రయత్నిస్తున్నారని, అధికారులను పట్టించుకోవడం లేదని సమాచారం.

ఈ వాహనాల విషయంపై కూటమి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని పలువురు కొత్త డీలర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రేషన్ డిపోల నుండి ఉచిత బియ్యం, ఉచిత రేషన్ సరుకులు తీసుకెళ్లడానికి కొందరు డీలర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కొత్త డీలర్లు అంటున్నారు.












Click it and Unblock the Notifications