మాజీ ఐజీపై చర్యలు, జగన్ భజన చేసిన అధికారుల లిస్టులో రామకృష్ణ, కృష్ణ...కృష్ణ !
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు చెక్ పెడుతూ వస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకువస్తున్నప్రజలకు సరైన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు ఆడిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్దం అవుతోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు చోటు చేసుకున్నాయని ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ ప్రభుత్వంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, సంబంధిత సాఫ్ట్ వేర్ కు సంబంధించి ఒక సంస్థకు అనుకూలంగా నిబంధనలు రూపొందించి టెండర్లు కట్టబెట్టారని రెవెన్యూ శాఖ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.

ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాజీ ఐజీ రామకృష్ణ పై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తోపాటు వైసీపీ నాయకుల భజన చేసిన అధికారులు లిస్టు రెడీ చేసి ఇప్పుడు ఒక్కొక్క అధికారి మీద చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు ఒక ప్రభుత్వం సిద్ధమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మాజీ ఐజీ రామకృష్ణ తీసుకున్న నిర్ణయాల వలన వైసీపీ నేతలకు లబ్ధి కలిగించారని వెలుగు చూసింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మాజీ ఐజీ రామకృష్ణ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ లు ఇష్టం వచ్చినట్లు చేశారని, ఉద్యోగాలు బదిలీలు ఇష్టానుసారంగా చేశారని, అక్రమ టెండర్ల కారణంగా రూ. 30 కోట్లు వైసీపీ నాయకులకు ధారపోయడం, మార్గదర్శి చిట్ఫండ్స్ పై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా వారి పైన కేసులు నమోదు చేయడం తదితరులు అంశాలపై మాజీ ఐజీ రామకృష్ణ ప్రమేయం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.

ఇదే విషయంపై మాజీ ఐజీ రామకృష్ణ అవినీతి అక్రమాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ సిసోదియా నుంచి చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ సిసోదియా ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మాజీ ఐజీ రామకృష్ణ పై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా పనిచేసిన రామకృష్ణ ఆయన అధికారం అడ్డం పెట్టుకొని భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. వాస్తవానికి కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన రామకృష్ణ ఆయన పదవి కాలం పూర్తి కావడంతో మళ్లీ కేంద్ర ప్రభుత్వ విధులు నిర్వహించడానికి వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మాజీ ఐజీ రామకృష్ణ మళ్లీ కేంద్ర ప్రభుత్వ శాఖల పరిధిలోకి వెళ్ళిపోతే అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మీద చర్యలు తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించిందని తెలిసింది. మొత్తం మీద జగన్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములు, పోరంబోకు భూములు, డీకేటీ భూములు, కాలవ పోరంబోకు భూములు వైసీపీ నాయకుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగడానికి సహకరించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాజీ ఐజీ రామకృష్ణపై త్వరలోనే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.












Click it and Unblock the Notifications