జగన్ తెచ్చిన జీఓను చెత్తలో వేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యలో కలకలం సృష్టించిన జీవో 117ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన జీవో 117 రద్దు కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా విధ్యను భోదించే విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి మనవి చేశాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం అయ్యి వివిద అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ప్రతి మేజర్ పంచాయతీలో ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని డైరెక్టర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన నియమాలపై ఉపాధ్యయ సంఘాలతో చర్చించారు.

మూడు, నాలుగు, ఐదు తరగతులను వెనక్కి తీసుకుంటే వచ్చే సమస్యలపై చర్చించారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలని, ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకుందామని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు చెప్పారు. ఉపాధ్యాయులకు ఆరు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించిన రెసిడెన్షియల్ శిక్షణను మార్చాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డైరెక్టర్ విజయరామరాజుకు మనవి చేశారు.
2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు 29, 42, 53 ఇప్పుడు కూడా అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు మనవి చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టు టీచర్లతోనే విద్యను బోధించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేశాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే విద్యా శాఖలో వైసీపీ తీసుకువచ్చిన జీవో 117 రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ జగన్ తీసుకువచ్చిన జీవో 117 రద్దు చేసింది.












Click it and Unblock the Notifications