చంద్రబాబు దెబ్బ, వెంకటరెడ్డి అబ్బా, పెద్దిరెడ్డి మాట విన్నందుకు ఏసీబీ ఎంట్రి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం గత వైసీపీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు ఆడిన అధికారుల మీద ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు.

ఇదే సమయంలో గత వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు బొక్కపడేలా వ్యవహరించిన సీనియర్ అధికారులకు చుక్కలు చూపించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Chandrababu Govt ordered ACB inquiry against former Director of Mines Department

గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గనుల శాఖా మంత్రిగా పని చేశారు. ఆ సందర్బంలో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖా డైరెక్టర్ గా వెంకటరెడ్డి పని చేశారు. 2021 నుండి 2024 మధ్యకాలంలో ఇసుక తవ్వకాలు, గనుల తవ్వకాల్లో భారీ అక్రమాలు చేశారని, అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వెంకటరెడ్డి పనిచేశారని, ప్రభుత్వా ఆదాయానికి భారీగా నష్టం వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనుల శాఖా మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై విచారణ చేసి నివేదికను ఏసీబీకి పంపించింది. గనుల శాఖా మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసి శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి ఏసీబీకి నివేదిక పంపించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ గుప్తా ఆయన మీద తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ గా పని చేసిన వెంకటరెడ్డి అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఏం చెప్పినా కాదనకుండా చేశారని, ప్రభుత్వ ఖాజానకు నష్టం వచ్చిందని, గనుల శాఖలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకావడం, చంద్రబాబు సీఎం అయిన తరువాత గనుల శాఖ నుంచి వెంకటరెడ్డిని బదిలీ చేశారు. గనుల శాఖ నుండి బదిలీ అయిన తరువాత వెంకటరెడ్డి విజయవాడ వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారని, ఆయన ఆచూకి లేదని కొందరు అధికారులు అంటున్నారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కేసు ఏసీబీ చేతికి వెళ్లడంతో ఆయనతో పాటు గనుల శాఖలో పని చేసిన ఉద్యోగులు సైతం హడలిపోతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+