తాత నీ సీటు కావాలి: మనవళ్ల అల్లరికి చంద్రబాబు - బాలయ్య ఇలా..!!
నిత్యం గంభీరంగా కనిపించే చంద్రబాబు మనవళ్ల ఆటలకు ఫిదా అయ్యారు. సంక్రాంతి వేడుకల కోసం నారా - నందమూరి కుటుంబాలు నారావారిపల్లికి చేరారు. వారితో పాటుగా బంధువులు అంతా అక్కడే కలిసి పండుగ జరుపుకుంటున్నారు. భోగి నాడు పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేసారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. బాలయ్య కుటుంబంతో కలిసి చంద్రగిరిలో వీరసింహారెడ్డి సినిమా వీక్షించారు. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగగా పేర్కొన్నారు.
తాత నీ సీటు కావాలి: మనవళ్ల అల్లరికి చంద్రబాబు - బాలయ్య ఇలా..!!#Chandrababu #Devansh #NaraLokesh #Balakrishna #Sankranthi2023 #Sankranthi #NaravariPalle #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/i7NrVwRLLV
— oneindiatelugu (@oneindiatelugu) January 16, 2023
రెండు కుటుంబాల సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు - బాలయ్య మనవళ్ల అల్లరి ప్రత్యేకార్షణగా మారింది. సంప్రదాయాలను అనుసరిస్తూ మకర సంక్రాంతి రోజున తమ ఇంటి దేవత నాగాలమ్మ కట్ట వద్ద పూజలు నిర్వహించిన అనంతరం.. బాలకృష్ణ, చంద్రబాబును వారి మనువళ్లు ఆటపట్టించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఇద్దరు తాతలతో దేవాన్ష్ ఆటపట్టించిన తీరు ఆకట్టుకుంది. చంద్రబాబు వద్దకు వెళ్లిన దేవాన్ష్ ..తాత నీ సీటు కావాలంటూ మారాం చేసారు. దీంతో.. అక్కడే ఉన్న బంధువులంతా దేవాన్ష్ అడగటం..చంద్రబాబు వారించటం సరాదాగా వీక్షించారు. మనవడి డిమాండ్ కు చివరకు చంద్రబాబు ఒప్పుకోక తప్పలేదు. కూర్చీలో నుంచి లేచి దేవాన్ష్ కు అప్పగించారు.

ఆ తరువాత బాలయ్యతోనే మనవళ్ల సందడి కొనసాగింది. బ్రాహ్మణి..సోదరి కుమారుడు దేవాన్ష్ తో కలిసి తాతతో ఆడుకున్నారు. దేవాన్ష్ బాలకృష్ణ తలపై నీళ్ల బాటిల్ తో సరదాగా కొట్టాడు. ఇక ఒకవైపు ఆలయం వద్ద మహిళలు పూజలు చేస్తుంటే .... మనవడితో బాబు, బాలయ్యలు ఆదుకున్నారు. చంద్రబాబు - భువనేశ్వరి పూజల్లో మనవడు దేవాన్ష్ తో కలిసి నిర్వహించారు. లోకేష్..బాలయ్య కుమారుడుతో సహా నందమూరి కుటుంబ సభ్యులు పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ చంద్రబాబు - బాలయ్య మనవళ్ల సందడితో మురిసిపోయారు.
మనవళ్లతో బాలయ్య ముచ్చట్లు..!!#Balakrishna #Chandrababu #NaraLokesh #Sankranthi2023 #SankranthiCelebrations #Kuppam #Naravalipalle #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/3XhVXujANy
— oneindiatelugu (@oneindiatelugu) January 16, 2023













Click it and Unblock the Notifications