చంద్రబాబు అరెస్టు పై యువత ఒపీనియన్ ఏంటి..?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్‌కు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఏపీలో తాను అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటూ 2014 ఎన్నికల ప్రచారం చేశారు చంద్రాబు. జాబు కావాలంటే బాబు రావాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడంతో నిరుద్యోగ యువత కనెక్ట్ అయ్యింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు స్కిల్స్ నేర్పించి వారికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో యువత కనెక్ట్ అయ్యింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారని యువత గుర్తుచేసుకుంటోంది. యువకుడైన లోకేష్‌కు మాత్రం మూడు శాఖలతో ఉద్యోగాలిచ్చారు కానీ నిజమైన నిరుద్యోగులకు మాత్రం చంద్రబాబు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని యువత నాటి పాలనను గుర్తు చేసుకుంటోంది. నాడు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రారంభించామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో నమ్మినట్లు పలువురు యువకులు చెబుతున్నారు. కానీ స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో వందల కోట్లు ప్రజాధనం మింగేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రూ.241 కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నిస్తున్నారు.

2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కదారి పట్టిన నిధులపై దృష్టి సారించి ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో డబ్బులు పక్కదారి పట్టాయని విచారణ సంస్థలు తేల్చాయి.పూర్తి ఆధారాలతో న్యాయస్థానం ముందు ఉంచడంతో చంద్రబాబుకు అరెస్టు తప్పలేదు.అయితే ఇది పూర్తిగా రాజకీయ కక్ష కోణంలోనే టీడీపీ, జనసేన,కమ్యూనిస్టు పార్టీలు చూస్తున్నాయని.. చట్టం ముందు ఎవరైనా ఒకటే అన్న విషయాన్ని వారు గుర్తించాలని యువత చెబుతోంది. అధికారం అడ్డం పెట్టుకుని ఇంకెన్ని దోపిడీలు చేశారో అని యువత ప్రశ్నిస్తోంది.

మోసం అనేది ఎంతో కాలం దాగదని ఏదో ఒకరోజు కచ్చితంగా బయటపడుతుందని యువత చెబుతోంది. ఇక చట్టం ముందు అంతా సమానులే అని గుర్తుచేస్తోంది. అంతా చంద్రబాబు అరెస్టు ప్రక్రియ గురించే మాట్లాడుతున్నారని.. స్కామ్ గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు యువత సూటిగా ప్రశ్నిస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ అవినీతిని బయటపెడతానని, టీడీపీ ప్రభత్వం అవినీతికి పాల్పడిందంటూ ఘాటు ఆరోపణలు చేశారు. మరి నేడు ఆధారాలతో సహా విచారణ సంస్థలు రుజువు చేశాయని... మరి దీనికి పవన్ సమాధానం ఏంటని యువత ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్‌ను యువత ఎంతో అభిమానిస్తుంది అయితే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ బయటపడ్డాక కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలవడాన్ని యువత జీర్ణించుకోలేకపోతోంది.












Click it and Unblock the Notifications