పవన్ కళ్యాణ్ అంటే బాబుకు భయమెందుకో తెల్సుకోవాలి: ఆనం, ప్రేయసి ఒడిలో..
నెల్లూరు: గబ్బర్ సింగ్‌ను (పవన్ కళ్యాణ్) చూస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి ప్రశ్నించారు. జనసేన అధ్యక్షులు పవన్‌ను చూసి చంద్రబాబు భయపడుతున్నారని విపక్షాలు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే.
తాజాగా, ఆనం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చిటికేస్తే చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు భయం వెనుక కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నానని ఎద్దేవా చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షి అని, దానికి మరణం ఉండదన్నారు. తాను ఏపీసీసీ రఘువీరా రెడ్డిని విమర్శించడం లేదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఎదురెళ్లేంత పిచ్చోడిని కాదన్నారు.

తాము ఎవరికీ వెన్నుపోటుపొడవమని, అనుకుంటే నేరుగా ఓడిస్తామన్నారు. మంత్రి నారాయణను తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.
ఆనం వివేకానంద రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆయనకు దశాబ్దాల క్రితం ఓ కల గన్నారట. తన ప్రేయసి ఒడిలో తల పెట్టుకుని, స్టైల్‌గా సిగిరెట్ తాగుతూ మృత్యువును కౌగిలించుకోవాలని ఉందట. అయితే, ఆ ప్రేయసి ఇంకా దొరకలేదని చెప్పారట.
చిరంజీవి మంచి వ్యక్తి అన్నారు. బహిరంగంగా ఆయన చేసే చేష్టలు ఆసక్తిని రేపుతుంటాయి. దీనిపై మాట్లాడుతూ... ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో కలిసిపోయేందుకు అలా చేస్తానని చెప్పారు. సంచలనాల కోసం మాత్రం కాదని చెప్పారు.
-
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ??











Click it and Unblock the Notifications