Chandrababu: ఐదో రోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై సోమవారం జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన బరువు 67 కేజీలు ఉన్నారని వెల్లడించారు.
జైలు డాక్టర్లు పరీక్షలు చేసి నివేదిక ఇచ్చారని అధికారులు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఐదవ రోజు హెల్త్ బులిటెన్ ను సెంట్రల్ జైల్లో ఇంఛార్జీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సోమవారం రాత్రి విడుదల చేశారు.

చంద్రబాబు హెల్త్ బులిటెన్ వివరాలు:
బీపీ: 136/80
టెంపరేచర్: సాధారణం
పల్స్: 64/మినిట్
రెస్పిరేటరీ రేటు: 12/మినిట్
వెయిట్: 67 కిలోలు
లంగ్స్: క్లియర్
ఫిజికల్ యాక్టివిటీ: గుడ్
మరోవైపు, చంద్రబాబు హెల్త్ బులిటెన్ పై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయడం లేదంటూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపడతామని న్యాయస్థానం పేర్కొంది. కాగా, చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు, టీడపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.
కాగా, చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి స్థాయి ఆరోగ్య నివేదిక జైలు అధికారులు ఇంకా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తమకు కూడా ఇప్పటి వరకు ఫిజికల్ డాక్యుమెంట్ ఇంకా అందలేదని న్యాయస్థానం తెలిపినట్లు వారు తెలిపారు. ఆ కారణం గా సమగ్ర వైద్య నివేదిక తాము ఇవ్వలేక పోతున్నామని న్యాయస్థానం వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications