డేట్, టైమ్ ఫిక్స్: చంద్రబాబు ఇడుపులపాయ టూర్..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు మెడల్స్ బహుకరించనున్నారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇడుపులపాయ పర్యటన ఖరారైంది. జనవరి 4వ తేదీన జరిగే ఆయనకు పర్యటనకు సంబంధించి అధికారిక వివరాలు వెల్లడయ్యాయి. కాగా, ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు మెడల్స్ బహుకరించనున్నారు. అనంతరం ఆయన ప్రసంగం ఉంటుంది.

ట్రిపుల్ ఐటీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం:
* 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ చేరుకుంటారు
* 3.05 గంటలకు స్నాతకోత్సవ వేదికకు చేరుకుని.. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రయోగశాల స్టాల్స్ పరిశీలన
* 3.40 గంటలకు స్నాతకోత్సవ వేదికపైకి వెళ్లేందుకు చంద్రబాబు ప్రత్యేక డ్రెస్ ధరిస్తారు
* 3.50 గంటలకు వేదికపైకి చేరుకుని విద్యార్థులకు మెడల్స్ అందజేస్తారు
* 4.31 గంటలకు సీఎం ప్రసంగం. అనంతరం 4.56 గంటలకు చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు.












Click it and Unblock the Notifications