చంద్రబాబు వద్ద.. ప్రతీ ఒక్కరు 10వేలు సంపాదించే ఫార్ములా!

రాష్ట్రంలో ప్రతీ వ్యక్తి రూ. 10 వేలు సంపాదించే ఫార్ములా ఒకటి తన వద్ద ఉందని రాజంపేట పర్యటన సందర్బంగా చంద్రబాబు పేర్కొన్నారు.

కడప : ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాఖాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు రాష్ట్రంలో సంక్షేమం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తి రూ. 10 వేలు సంపాదించే ఫార్ములా ఒకటి తన వద్ద ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.

అయితే ఆ ఫార్మూలా ఏంటో మాత్రం చంద్రబాబు వివరించకపోవడం గమనార్హం. పర్యటనలో భాగంగా.. రాజంపేటలోని క్రీడా మైదానంలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటిన ఆయన..అనంతరం అక్కడ నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. అటు తర్వాత దళితవాడలో మంచినీటి పథకం, దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Chandrababu interesting comments in Rajampeta visit

శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత.. రైల్వే స్టేషన్ రహదారి నుంచి పాత బస్టాండు వరకు జనచైతన్య యాత్రను చేపట్టారు. ఈ సందర్బంగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కింది స్థాయి వారికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఇక జగన్ పై విమర్శలు గుప్పిస్తూ.. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు.

ఇక కాంగ్రెస్ పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయిందని ఆరోపించారు చంద్రబాబు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే.. ఫ్యాన్, హస్తాలు వదిలేసి, సైకిల్ ఎక్కాలని పిలుపునిచ్చారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+