అసెంబ్లీ: మాట్లాడుతుండగా వైసిపి గందరగోళం, బాబు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం ఏపీ శాసన సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. కాగా, ప్రత్యేక హోదా పైన చర్చకు వైసిపి పట్టుబట్టిన నేపథ్యంలో ఉదయం అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది.
చంద్రబాబు జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హోదా పైన చర్చించాల్సిందేనని సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా డిమండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. వైసిపి ఎమ్మెల్యేల నిరసన మధ్యనే చంద్రబాబు జీఎస్టీ బిల్లు ప్రవేశ పెట్టారు.

వైసిపి సభ్యుల ఆందోళన పైన చంద్రబాబు మాట్లాడారు. ఓ బిల్లు ప్రవేశ పెడుతుంటే ఇది సరికాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు. మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వస్తే మేం చర్చకు సిద్ధమన్నారు. వైసిపికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆ పార్టీ తీరును ఖండిస్తున్నానని చెప్పారు.
మీరు మీ సీట్లలోకి వెళ్లి దేని పైన ప్రకటన చేయమంటే దానిపైన చేస్తానని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పైన చిత్తశుద్ధి ఉంటే సభకు సహకరించాలన్నారు. సభా గౌరవాన్ని మంటగలుపుతున్నారన్నారు. వైసిపి సభ్యుల తీరు పైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం చంద్రబాబు... ప్రత్యేక హోదా పైన మాట్లాడేందుకు ఉపక్రమించారు. ఆ సమయంలోను వైసిపి సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ గందరగోళం ఏర్పడింది. సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు సభను రేపటికి వాయిదా వేశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications