మంచి లక్షణాలున్న.. : అశోక్ బాబుపై చంద్రబాబు ప్రశంసలు
ఏలూరు: ఏపీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. అశోక్ బాబు మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడని కొనియాడారు.
అంతేగాక, అశోక్ బాబు టీడీపీలోకి వచ్చి క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అశోక్ బాబు ఎప్పుడు పార్టీలోకి వచ్చినా సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పశ్చిమగోవారి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు మంగళవారం ఇక్కడ ఎన్జీఓ హోమ్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ాయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఎన్జీవోలు తీవ్ర పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా విభజన అనంతరం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
Recommended Video

ఎపి కేబినెట్‌లోకి ముస్లిం మంత్రి: చంద్రబాబు












Click it and Unblock the Notifications