ప్రమాణానికి కెసిఆర్ పిలువలేదు: చంద్రబాబు, డైలమా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు... కెసిఆర్ ప్రమాణానికి చంద్రబాబు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి కెసిఆర్ ఇప్పటి వరకు చంద్రబాబుకు ఆహ్వానం పంపించలేదు. చంద్రబాబు కూడా ఆహ్వానం పంపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా కనిపించడం లేదు.
చంద్రబాబు ఢిల్లీలో శుక్రవారం బిజీబిజీగా గడిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జూన్ 8న జరగనున్న తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీతోపాటూ పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్లు చంద్రబాబు చెప్పారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రులను మినహా మిగిలిన ముఖ్యమంత్రులనందర్నీ తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని చంద్రబాబు తెలిపారు. తెలంగాణకు కాబోయే సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించే విషయాన్నీ పరిశీలిస్తానన్నారు. ఆయనకు ఆహ్వానం పంపాలో లేదో చూద్దామన్నారు. అయితే, కెసిఆర్ ప్రమాణస్వీకారానికి ఇంత వరకు తనకు ఆహ్వానం అందలేదన్నారు.
కాగా, జూన్ 2వ తేదీన తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 8న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications