వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధారణ పెంకుటిల్లు..! మట్టినేల ప్రహారీ..! చంద్రబాబు ఉండబోయే నివాసం అదే..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : అసాధారణ సౌధాల నుంచి ఆసాంతం నేలమీదకి రావడం అంటే ఇదే. ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నివాసం పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అందుకు తగ్గట్టుగా వాటికి చెక్ పెట్టే రీతిలో వ్యవహరించేందుకు బాబు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మేడలు, మిద్దెలు, భవంతులు కాకుండా అతి సాధారణమైన పెంకుటిల్లు, మట్టినేల ప్రహారీలో ఉండేందుకు బాబు సిద్దమౌతున్నారు. ప్రతిపక్షనేత హోదాలో ప్రజల మద్యన ఉండేందుకు ఉండవల్లిలోని ఓ పెంకుటిల్లుకు చిన్న చిన్న మరమ్మతులు చేయించుకుంటున్నారు చాంద్రబాబు. చంద్రబాబు అదికారికి నివాసం అదే కానున్నట్టు తెలగు తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు.

Recommended Video

రైతు సమస్యలపై సీఎం కు లేఖ రాసిన బాలయ్య
 ఆకాశ హార్మ్యాల నుంచి నేల మీదకు..! అతి సాధారణ ఇంట్లో కి చంద్రబాబు..!!

ఆకాశ హార్మ్యాల నుంచి నేల మీదకు..! అతి సాధారణ ఇంట్లో కి చంద్రబాబు..!!

ఏపి మాజీ సీఎం చంద్రబాబు, కుటుంబసమేతంగా ఆ శాంతమ్మ పాత ఇంట్లోకి మకాం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ఆ ఇల్లు ప్రత్యేకతలు ఏమిటో తెలుసా...? అదొక పెంకుటిల్లు. అదొక పురాతనమైన ఇల్లు. ఆ ఇంటి యజమాని శాంతమ్మ... ఓ సాధారణ గ్రామ పంచాయతీ సర్పంచ్. పాటుబడినట్టుగా ఉన్న ఆ పాత ఇంటికి మరమ్మతులు చేయించి, అందులోకి చంద్రబాబు వెళతారట. అతి పెద్ద బంగళా నుంచి, పాటుబడిన పెంకుటింటికి చంద్రబాబు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు...? నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విలాసవంతమైన బంగ్లాలో అద్దెకు ఉన్న చంద్రబాబుపై ఎన్నెన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన లింగమనేని వారి ఇంటిని తీసుకున్న ఆయన.. ముఖ్యమంత్రిగా అక్కడే నివాసం ఉంటున్నారు. దాని పక్కనే ప్రజావేదిక పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించింది.

 అతి సాధారణ పెంకుటిల్లు..! ఇప్పుడు అది చంద్రబాబు నివాసం..!!

అతి సాధారణ పెంకుటిల్లు..! ఇప్పుడు అది చంద్రబాబు నివాసం..!!

దీంతో ఏపీ సీఎం జగన్.. ప్రజావేదికను కూల్చివేయాలని చెప్పటంతో పాటు.. కరకట్టపైన అక్రమంగా నిర్మించిన యాభై.. అరవై ఇళ్లను కూల్చివేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ప్రజావేదిక తర్వాత కూల్చే ఇల్లు చంద్రబాబు అద్దెకు ఉన్న ఇంటిగా చెబుతున్నారు. దీనికి తోడు ఏపీ అధికారపక్ష నేతలు కూడా... 'అక్రమంగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు ఎలా ఉంటారు..?' అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బాబు ఉండాల్సిన ఇంటికి సంబంధించిన చర్చ టీడీపీలో జోరుగా సాగుతోంది. ఏపీ అధికారపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. వేలెత్తి చూపించేందుకు ఛాన్స్ లేని రీతిలో బాబు ఇంటిని ఎంపిక చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉండాలి..! అందుకే ఆ ఇంటిని ఎంపిక చేసుకున్న బాబు..!!

ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉండాలి..! అందుకే ఆ ఇంటిని ఎంపిక చేసుకున్న బాబు..!!

అన్ని వసతులు ఉన్న విలాసవంతమైన భవనంలోకి మారితే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. అత్యాధునిక వసతులున్న ఇంటి నుంచి బాబును బయటకు పంపించి.. సరైన ఇల్లు లేకుండా చేశారేమిటన్న ప్రశ్న సాధారణ ప్రజల్లో తలెత్తేలా తెలుగు తమ్ముళ్లు ప్లాన్ వేస్తున్నారు. చంద్రబాబు పేరు చెప్పినంతనే విలాసాలకు కేరాఫ్ అడ్రస్ గా.. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారన్న విమర్శ ఉంది. వీటికి చెక్ పెట్టేలా, తాజాగా ఒక ఇంటిని టీడీపీ నేతలు ఎంపిక చేశారు. ఇప్పుడున్న నివాసానికి దగ్గర్లోనే మాజీ సర్పంచ్ శాంతమ్మ తన పాత పెంకుటిల్లును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అది, 90 ఏళ్ల నాటి ఇల్లు. అందులో ఉంటే బాగుంటుందన్న భావనకు టీడీపీ నేతలు వచ్చారు.

 అక్రమ నిర్మాణం నుండి అతి సాధారణ కట్టడంలోకి బాబు..! ప్రజల కోసమే అంటున్న నాయకులు..!!

అక్రమ నిర్మాణం నుండి అతి సాధారణ కట్టడంలోకి బాబు..! ప్రజల కోసమే అంటున్న నాయకులు..!!

బాబు టేస్ట్ కు తగ్గట్లు కొద్దిగా మార్పులు చేయటంతోపాటు.. ఇంటి చుట్టూ పరిసరాలు కూడా విశాలంగా ఉండటం ఆయన ఓకే అంటారని చెబుతున్నారు. సెక్యురిటీపరంగా ఇబ్బందులు లేకుండా తాజా పెంకుటిల్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాథమికంగా ఈ ఇల్లు టీడీపీ నేతలు ఓకే చేసినట్లేనని చెబుతున్నారు. అంతిమ నిర్ణయం కోసం బాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఒకవేళ బాబు ఓకే అంటే... ఇంటి ఎంపిక విషయంలో బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్టే. బాబు లాంటి నేత.. పెంకుటింట్లో ఉండటం సెంటిమెంట్ పండేలా చేస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
There is criticism on Chandrababu that he enjoying luxury life. To check these, a fresh house was chosen by the TDP leaders. Former Sarpanch Shantamma is ready to hand over her old pantry to the present residence. It was a 90-year-old house. TDP leaders come up with the idea that it is good for babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X