సీలింగ్ ఫ్యాన్‌ VS టేబుల్ ఫ్యాన్‌.. కరెంట్ బిల్లు సేవ్ చేసేది ఇదే ???

వేసవి వచ్చేసిందంటే చాలు... వేడి నుంచి ఉపశమనం కోసం ప్రతి ఇంట్లో ముందుగా గుర్తుకొచ్చేది ఫ్యాన్‌. కానీ మార్కెట్‌లో సీలింగ్ ఫ్యాన్‌లు, టేబుల్ ఫ్యాన్‌లు, కొత్తగా BLDC ఫ్యాన్‌లు వంటి అనేక ఎంపికలు ఉండటంతో, ఏది తీసుకోవాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న కరెంట్ బిల్లుల నేపథ్యంలో "తక్కువ విద్యుత్‌తో ఎక్కువ గాలి ఇచ్చేది ఏది?" అన్న ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ మధ్య అసలు తేడాలు ఏమిటి? ఏది మీకు సరిపోతుంది? అన్నది క్లియర్‌గా తెలుసుకుందాం.

మొదట విద్యుత్ వినియోగం గురించి చూస్తే, టేబుల్ ఫ్యాన్ సాధారణంగా 30-50 వాట్ల మధ్య మాత్రమే పనిచేస్తుంది. సీలింగ్ ఫ్యాన్‌లు మాత్రం 60-80 వాట్ల వరకు కరెంట్ తీసుకుంటాయి. కాబట్టి రోజంతా ఫ్యాన్ వాడేవారికి టేబుల్ ఫ్యాన్ కొంత మేర కరెంట్ సేవ్ చేస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన BLDC సీలింగ్ ఫ్యాన్‌లు ఈ లెక్కలను మార్చేశాయి. ఇవి కేవలం 28-35 వాట్లతోనే పనిచేస్తూ, టేబుల్ ఫ్యాన్‌తో సమానంగా లేదా అంతకంటే తక్కువ కరెంట్ వినియోగిస్తాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇవే బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.

ceiling-fan-vs-table-fan-which-is-best-to-save-electric-bill-and-other-full-details

గాలి ప్రసరణ విషయానికి వస్తే.. సీలింగ్ ఫ్యాన్ స్పష్టంగా ముందుంటుంది. గదిలోని ప్రతి మూలకు గాలిని సమానంగా పంపిస్తూ, మొత్తం రూమ్‌ను చల్లబరుస్తుంది. కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి గాలి కావాలంటే ఇది బెస్ట్. టేబుల్ ఫ్యాన్ మాత్రం ఒకే దిశలో గాలిని పంపుతుంది. మీ దగ్గర కూర్చున్న వారికి మాత్రం బలమైన గాలి ఇస్తుంది కానీ, మొత్తం గదిని చల్లబరచలేడు.

సౌకర్యం పరంగా చూస్తే.. టేబుల్ ఫ్యాన్‌కు ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. దీన్ని సులభంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్లవచ్చు. బెడ్‌రూమ్ నుంచి హాల్‌కి, కిచెన్ నుంచి బాల్కనీకి... అవసరాన్ని బట్టి ఎక్కడైనా వాడుకోవచ్చు. సీలింగ్ ఫ్యాన్ మాత్రం ఒకేచోట ఫిక్స్ అయిపోతుంది. కానీ అది నేలపై స్థలం తీసుకోదు, గది క్లీన్‌గా కనిపిస్తుంది.

ధర విషయానికి వస్తే.. టేబుల్ ఫ్యాన్‌లు తక్కువ ధరకే లభిస్తాయి, ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. సీలింగ్ ఫ్యాన్‌లకు మాత్రం కొనుగోలు ధరతో పాటు ఇన్‌స్టాలేషన్ ఖర్చు కూడా ఉంటుంది. అయితే అవి ఎక్కువకాలం మన్నికగా పనిచేస్తాయి.

నిర్వహణ పరంగా చూస్తే.. టేబుల్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడం చాలా ఈజీ. సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయాలంటే కొంచెం కష్టం, ముఖ్యంగా ఎత్తులో ఉండటం వల్ల జాగ్రత్త అవసరం. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో టేబుల్ ఫ్యాన్‌ను జాగ్రత్తగా వాడాలి, సీలింగ్ ఫ్యాన్ అయితే ఈ సమస్య ఉండదు.

అంతే కాకుండా శబ్దం విషయంలో కూడా తేడా ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్‌లు సాధారణంగా చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. టేబుల్ ఫ్యాన్‌లు స్పీడ్ పెంచితే కొంచెం శబ్దం చేస్తాయి. నిద్ర సమయంలో సైలెంట్ ఎన్విరాన్‌మెంట్ కావాలంటే సీలింగ్ ఫ్యాన్ మెరుగ్గా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+