బాబు ఇలాకాలో జగన్‌పార్టీ గెలుపువల్లే: నాని సంచలనం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలవడాన్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత జీర్ణించుకోలేకపోతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం విమర్శించారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుండి తప్పించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ కుట్రల్లో సభాపతి కోడెల శివప్రసాద రావు భాగం కాకుండా ఉండాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

Chandrababu is not digesting winning of YSRCP: Kodali Nani

కాగా, అంతకుముందు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూతో కలిసి స్పీకర్ కోడెల శివప్రసాద రావుతో భేటీ అయ్యారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పైన చర్చించారు. తాను ఎవర్నీ కించపర్చేలా మాట్లాడలేదని, సభ అంటే తనకు గౌరవం ఉందని చెవిరెడ్డి చెప్పారు.

మరోవైపు, అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిన శివప్రసాద్ రెడ్డి, మణిగాంధీలను తిరిగి సభకు అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది. అయితే, సభ సంప్రదాయానికి అనుగుణంగా వారు క్షమాపణ కోరితే సస్పెన్షన్ రివోక్ చేయవచ్చునని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+