చంద్రబాబు ఐటీ నోటీసుల వ్యవహారంలో కీలక పరిణామం..!!

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన చంద్రబాబుకు ఐటి నోటీసులు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో నిందితులుగా పేర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పరారయ్యారు. యోగేష్ గుప్తాకు ఐటి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లిన ఇద్దరి వ్యవహారంలో ఐటి ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలతో ఆదాయపన్ను శాఖ ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఇందులో మరో ఇద్దరు మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చే సమయంలో ఆ ఇద్దరు విదేశాలకు వెళ్లినట్లుగా అధికారులకు గుర్తించారు ఈ నెల ఐదున వాసుదేవ్ దుబాయ్ కు, పిఏ శ్రీనివాసరావు 6న అమెరికాకు వెళ్లినట్లుగా నిర్ధారించారు. తెలుగుదేశం హయాంలో 2016 నుంచి 2019 మధ్యకాలంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ నుంచి రూ 118 కోట్లు ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Chandrababu IT notice controversy escalates as two accused flee overseas

ఈ వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2016లో నాటి సీఎం చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్ జి పళ్లెంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాస్తదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్ గా అవతారమే తెరని ఐటీ కి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్ జి పల్లంజీ సమస్త ప్రతినిధి మనోజ్ వాస్తవ పార్థసాని నివాసంలో ఐటి తనిఖీలు నిర్వహించింది అనంతరం మనోజ్ ను, విచారించారు బోగస్ కాంట్రాక్టులు వరకు ఆటల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటి వెల్లడించింది.

మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్టులు పొందారు, అందుకు ఎలా డబ్బు సమకూర్చారు, ముడుపులు ఎలా చేతులు మారాయి అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు మనోజ్, పి ఎస్ శ్రీనివాస్ ఇద్దరు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించడంతో ఆదాయపన్ను శాఖ తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+